ETV Bharat / state

సీఎం రేవంత్​ను కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ - రూ.కోటి చెక్​ అందజేత - ap deputy cm donates 1 crore to Tg

AP Deputy CM Pawan Kalyan meet CM Revanth Reddy : సీఎం రేవంత్​ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్​ నివాసానికి డిప్యూటీ సీఎం పవన్​ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళాన్ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​ అందించారు.

AP Deputy CM Pawan Kalyan meet CM Revanth Reddy
AP Deputy CM Pawan Kalyan meet CM Revanth Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 10:33 AM IST

Updated : Sep 11, 2024, 11:38 AM IST

AP Deputy CM Pawan Donated One Crore Rupees to CM Revanth : సీఎం రేవంత్​ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​ భేటీ అయ్యారు. ఈ భేటీ జూబ్లీహిల్స్​లోని సీఎం రేవంత్​ రెడ్డి నివాసంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్​ నివాసానికి డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​ అందించారు.

AP Deputy CM Pawan Donated One Crore Rupees to CM Revanth
AP Deputy CM Pawan Kalyan meet CM Revanth Reddy (ETV Bharat)

వరద బాధితులకు ప్రముఖులు విరాళాలు : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలం అయిందే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మంలోని మున్నేరు వాగు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. మున్నేరు వాగు ప్రవాహానికి మున్నేరు వాగు పరివాహక ప్రాంతాలు అన్ని నీట మునిగాయి. ఇక్కడ ఒకానొక సమయంలో వరద ఉద్ధృతి 36 అడుగుల వరకు ప్రవహించింది. దీంతో బాధితులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. తరలించడానికి వీలులేని వారు ఇంటి పై కప్పులపై ఉంటూ సహాయం కోసం ఎదురు చూశారు.

మున్నేరు వరద దాటికి తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత ఎటు చూసిన హృదయవిదాకరమైన సన్నివేశాలే కనిపించాయి. ఈ క్రమంలో సినీ ప్రముఖులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, సామాన్యులు ఇలా అందరూ వారికి తోచిన విరాళాలను సీఎం సహాయక నిధికి అందించారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణకు వరదలకు కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు.

ఏపీకి రూ.కోటి విరాళం : అలాగే విజయవాడలోని బుడమేరు వాగుకు వచ్చిన వరదతో విజయవాడ వరద నీటితో మునిగిపోయింది. వరద తగ్గి వారం అయిన కొన్ని ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. దీంతో వేల కోట్లు నష్టం వాటిల్లింది. అప్పుడు వరద బాధితులకు సహాయార్థం ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం వ్యక్తిగతంగా రూ.కోటి నగదును విరాళం ఇచ్చారు. ఆ చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. అలాగే వరద ముంపునకు గురైన గ్రామాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అదే సమయంలో తెలంగాణ వరద బాధితులకు కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ చెక్కును సీఎం నివాసానికి వెళ్లి పవన్​ అందించారు.

'మున్నేరు' మిగిల్చిన విషాదం : ఆనవాళ్లను కోల్పోయిన ఆవాసాలు - కట్టుబట్టలతో రోడ్డునపడ్డ బాధితులు - Munneru Flood in Khammam

సర్వం కోల్పోయాం - విజయవాడ​ వరద బాధితులను కదిలిస్తే కన్నీరే - VIJAYAWADA FLOODS LATEST UPDATES

Last Updated : Sep 11, 2024, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.