CM Jagan key comments: రాష్ట్రంలో ఎవరూ ఊహించని రీతిలో మూడు రాజధానులు తీసుకొచ్చిన ఘనత తనదేనని సీఎం జగన్ అన్నారు. విశాఖలోని రాజానగరం, ఇచ్ఛాపురం, గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న ఆయన, ఎన్నికల గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానన్నారు. రెండున్నరేళ్లుగా విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు పోరాడుతుంటే కనీసం నోరుమెదపని సీఎం జగన్, ఇప్పుడు ఒక్కసారిగా స్వరం మార్చారు. తన పోరాటం వల్లే ప్రైవేటీకరణ నిలిచిపోయిందంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. వేలాది మంది కార్మికులు రోడ్డుపైకి వచ్చిన వందల రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నా సీఎం జగన్ సహా వైసీపీ నేతలెవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి తానే ప్రైవేటీకరణకు అడ్డుపడ్డానని సీఎం జగన్ ప్రసంగించడంతో జనాలు ఒక్కసారిగా అవాక్కైయ్యారు.
ఊరు ఏదైనా కావచ్చు, కానీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సభ అంటే చాలు కష్టాలు మాత్రం అలాగే ఉంటున్నాయి, ఆయన ఏ ఊర్లో సభ పెడితే ఆ ఊర్లో జాతీయ రహదారి దిగ్బంధం, ట్రాఫిక్ కష్టాలు సీఎం సభ అంటే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. సీఎం పర్యటన సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. విశాఖ నుంచి గాజువాక వెళ్లే వాహనాలను ఆటోనగర్ వద్ద మళ్లింపు.అనకాపల్లి నుంచి విశాఖ వచ్చే వాహనాలు శ్రీనగర్ వద్ద మల్లింపు చేశారు.గాజువాక వైపు వెళ్లే వాహనాలను ఆటోనగర్ వద్ద ఆర్ టి సి బస్సు లు నిలిపి వేసారు. ఈ పరిస్థితిలో కార్యాలయాలు కళాశాలలో ముగించుకుని వచ్చేటువంటి విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు . ఆర్టీసీ బస్సులు ఆటోనగర్ వరకు మాత్రమే నడపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటలసేపు ట్రాఫిక్ నిలుపుదల చేయడం వల్ల కొంతమంది ప్రయాణికులు పోలీసులతో వాగ్వాదం చేశారు.
జగన్‌కు విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదు: టీడీపీ-జనసేన - Pattabhi Ram key comments on CM
ప్రధాని మోదీపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ తీవ్ర అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ప్రధాని మాకు సుద్దులుచెబుతారా? మోదీ ఏ ఎండకా గొడుగు పడుతున్నారు అని రోపించారు. ప్రధాని మోదీ దిగజారిమాట్లాడుతున్నారని, కూటమి నేతలు ముగ్గురు తోడు దొంగలు అన్నారు. కూటమి ఎక్కడ అధికారంలోకి వస్తుందికూటమి బంగాళాఖాతం లో కలుస్తుందని అని వ్యాఖ్యా నించారు. రైల్వే జోన్ పై ప్రధాని వ్యాఖ్యలనుఖండిస్తు న్నామని, జోన్ కి భూమి ఇచ్చామని చెప్పారు. ప్రతిపక్షాలకు, ఈసీ తందానా తానా అంటోందని అని అన్నారు.