YS Jagan seek CBI court permission: పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక చేసుకున్నారు. ఈనెల 13న పోలింగ్ జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఈనెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును సీఎం జగన్ కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని కోర్టును జగన్ కోరారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు విదేశాలకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
జగన్ అభ్యర్థనపై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. జగన్ పిటిషన్ పై సీబీఐ కోర్టు గురువారం జరిపింది. అయితే జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది.