ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నాం. 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ పై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి....సామాజిక న్యాయం గెలవాలి అనేదే తెలుగుదేశం సిద్ధాంతం. అత్యంత నిరుపేదలకు ఫలాలు… pic.twitter.com/CUfIdcFvRD
— N Chandrababu Naidu (@ncbn) August 1, 2024
AP CM and Ministers On SC ST Classification: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ధర్మాసనం తీర్పును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణపై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, సామాజిక న్యాయం గెలవాలి అనేదే తెలుగుదేశం సిద్ధాంతమని స్పష్టం చేశారు. అత్యంత నిరుపేదలకు ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుందని వెల్లడించారు. దళితులు ఐక్యంగా ఉండి, అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆర్థికంగా, సామాజికంగా వారి జీవితాల్లో వెలుగులు రావాలని పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. 30 ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది చంద్రబాబు గారు. రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం. అన్ని…
— Lokesh Nara (@naralokesh) August 1, 2024
Minister Nara Lokesh: ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పును విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్వాగతించారు. 30 ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది చంద్రబాబు అని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎజెండాగా లోకేశ్ పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.
— Anitha Vangalapudi (@Anitha_TDP) August 1, 2024
30 ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు - రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన పలువరకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కూటమి ప్రభుత్వం…
చంద్రబాబు తీసుకొచ్చిన చట్టం వల్లే న్యాయం బతికింది: మందకృష్ణ - Manda Krishna Special thanks to cbn
Home Minister Vangalapudi Anitha: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును హోంమంత్రి వంగలపూడి అనిత స్వాగతించారు. 30 ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది చంద్రబాబు అని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు చేయడం వల్ల పలువురికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నామని, అన్ని సామాజిక వర్గాల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి టీడీపీ ఎజెండా అని అనిత స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుని స్వాగతిస్తున్నాను.
— Satya Kumar Yadav (@satyakumar_y) August 1, 2024
అణగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగింది. అలుపెరుగని పోరాటయోధుడు మంద కృష్ణ మాదిగ గారికి శుభాకాంక్షలు.
వర్గీకరణకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఇచ్చిన మాట… pic.twitter.com/pyGVFEWC4Q
Minister Satya Kumar: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుని స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ తెలిపారు. అణగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగిందని ఎక్స్ వేదికగా స్పందించారు.
మంద కృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటయోధుడుగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వర్గీకరణకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన మాట నిలబెట్టున్న మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అణగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం చేస్తానన్న మోదీ ఆచరణలో చూపించారన్నారు. అలుపెరుగని పోరాటయోధుడిలా పోరాడిన మంద కృష్ణ మాదిగకి మంత్రి సత్యకుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను. అన్నీ సామాజిక వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయం దిశగానే అడుగులు వేస్తుంది. దళితుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయడంలో టీడీపీ…
— Gottipati Ravi Kumar (@ravi_gottipati) August 1, 2024
Minister Gottipati Ravi Kumar: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వాగతించారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సామాజిక న్యాయం దిశగానే అడుగులు వేస్తుందన్నారు. దళితుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయడంలో టీడీపీ ముందుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.