ETV Bharat / state

చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు - అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఛార్జిషీట్‌ - Amaravati Assigned Lands Case

AP CID Charge Sheet on Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు నమోదు చేసింది. 2020 ఏడాది నాటి ఎసైన్డ్‌ భూముల కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. కేసును పరిశీలించాలని ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఆదేశించారు.

AP CID Case On Chandrababu
AP CID Chargesheet on Chandrababu Naidu
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 12, 2024, 2:16 PM IST

చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు- అసైన్డ్‌ భూముల కేసులో ఛార్జిషీట్‌

AP CID Charge Sheet on Chandrababu Naidu : ఏపీ రాజధాని అమరావతిలో ఎసైన్డ్‌ భూముల కొనుగోలు ఆరోపణలతో సీఐడీ 2020లో నమోదు చేసిన కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అభియోగపత్రం దాఖలు చేసింది. దానిని పరిశీలించాలని ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు.

ఎసైన్డ్‌ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ యల్లమాటి ప్రసాద్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో 2020 ఫిబ్రవరి 27న పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఇదే వ్యవహారంపై నల్లూరు రవికిరణ్‌ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 2020 మార్చి 3వ తేదీన మరో కేసు నమోదుచేసి, పలువురిని నిందితులుగా పేర్కొంది. 2022లో మాజీమంత్రి నారాయణను నిందితుల జాబితాలో చేర్చింది. సీఐడీ కేసుల్ని రద్దు చేయాలంటూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నిబంధనల్ని పాటించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే ప్రస్తుతం ఈ కేసు విచారణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

అయిదేళ్లుగా ప్రజలకు నరకం చూపించి - ఎన్నికల ముందు ఎందుకీ హడావుడి?

క్రైం నంబర్లు 14/2020, 15/2020 కేసులకు సంబంధించి ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో సోమవారం అభియోగపత్రం దాఖలు చేసింది. క్రైం నంబరు 14/2020లో చంద్రబాబును 40వ నిందితుడిగా పేర్కొంది. మరో 22 మందిని నిందితులుగా చేర్చాలని ఏసీబీ కోర్టులో సీఐడీ డీఎస్పీ మెమో దాఖలు చేశారు. చంద్రబాబుతో పాటు, నారాయణ, తుళ్లూరు మండలం అప్పటి తహశీల్దార్‌ సుధీర్‌బాబు, రామకృష్ణ హౌజింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ అంజనీకుమార్‌ను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు.

Amaravati Assigned Land Case On Chandrababu : ఎసైన్డ్‌ భూములకు ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఎసైనీదారులను భయాందోళనలకు గురిచేసి అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, ఇతర మంత్రులు, వారి బినామీలు తక్కువ ధరకు భూములు కొన్నట్లు అభియోగపత్రంలో సీఐడీ ఆరోపించింది. కొనుగోలు చేసిన ఎసైన్డ్‌ భూములకు భూసమీకరణ ప్రయోజనాలు పొందేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చి, నిబంధనలకు విరుద్ధంగా జీవో నెంబర్ 41ను జారీ చేయించారని పేర్కొంది.

భూముల కొనుగోలుకు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కేపీవీ అంజనీకుమార్, గుమ్మడి సురేశ్, కొల్లి శివరామ్, మంత్రుల కుటుంబసభ్యులు బినామీలుగా వ్యవహరించారంది. మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్‌పై కూడా ఒత్తిడి చేసి భూములను రిజిస్టర్‌ చేయించారని పేర్కొంది. నారాయణ, ఆయన కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, కంపెనీల నుంచి రామకృష్ణ హౌజింగ్‌ సొసైటీ, ఇతర రియల్‌ ఎస్టేట్‌ సంస్థల మధ్యవర్తులకు 16 కోట్ల 50 లక్షల నిధులు వెళ్లాయంది. ఆ డబ్బులను ఎసైన్డ్‌ రైతులకు చెల్లించి, నారాయణ బినామీలు అక్రమంగా విక్రయ దస్తావేజులు రాయించుకున్నారని సీఐడీ ఛార్జిషీట్‌లో పేర్కొంది.

రెవెన్యూ రికార్డుల్ని పరిశీలిస్తే వాస్తవ ఎసైనీదారుల స్థానంలో 945 ఎకరాల్లో భూసమీకరణ పథకం కింద ప్రయోజనం పొందేందుకు 13 వందల 36 మంది దరఖాస్తు చేసుకున్నారని సీఐడీ ఆరోపించింది. బినామీగా వ్యవహరించిన కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలంటూ వేసిన పిటిషన్‌ ఏసీబీ కోర్టులో పరిశీలనలో ఉన్నట్లు సీఐడీ వెల్లడించింది.

కొలిక్కి వచ్చిన సీట్ల వ్యవహారం - జనసేన, బీజేపీకి 8 ఎంపీ, 31 అసెంబ్లీ సీట్లు

జనాలను హడలెత్తించిన సీఎం సభ- ఇంట్లో ఉన్నవారు సేఫ్! బస్సుల బంద్​కు తోడు పోలీసు ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.