ETV Bharat / state

మూడంచెల విధానంతో విభజన సమస్యలకు పరిష్కారం- నిర్ణయించిన చంద్రబాబు, రేవంత్​ సమావేశం - AP TELANGANA CMS MEETING

AP and Telangana CMs Meeting: విభజన సమస్యల కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేసి మూడంచెల్లో సమస్యలు పరిష్కరించాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు. రెండు వారాల్లో ఇరు రాష్ట్రాల సీఎస్​ల నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ఉన్నతస్థాయి అధికారుల కమిటీని నియమించనున్నారు. అధికారుల కమిటీ పరిష్కరించలేని సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ, కమిటీ సైతం పరిష్కరించలేని అంశాలపై సీఎంలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 7:04 AM IST

Updated : Jul 7, 2024, 10:13 AM IST

AP_and_Telangana_CMs_Meeting
AP_and_Telangana_CMs_Meeting (ETV Bharat)

AP and Telangana CMs Meeting: ఉమ్మడి ఏపీ విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, అధికారుల బృందం సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. సంప్రదింపుల కోసం ప్రజాభవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆత్మీయంగా పలకరించి స్వాగతం పలికారు.

తెలంగాణ మంత్రులూ చంద్రబాబును సాదరంగా స్వాగతించారు్. అనంతరం లోపలకి తోడ్కొని వెళ్లారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు శాలువా కప్పి కాళోజీ నారాయణరావు రచించిన 'నా గొడవ' పుస్తకాన్ని బహుకరించారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కకు చంద్రబాబు నాయుడు వేంకటేశ్వరస్వామి ఫోటోలను బహుకరించారు.

భేటీలో ఏపీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, పలువురు అధికారులు తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఇద్దరు సీఎస్‌లు ఆయా రాష్ట్రాల ఎజెండాలు చదివి వినిపించారు.

పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించే అవకాశం లేనందున మూడంచెల్లో పరిష్కరించుకోవాలని సీఎంలు నిర్ణయించారు. ఈ క్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అంశాలవారీగా చొరవతీసుకుని న్యాయపరమైన చిక్కులపైనా చర్చించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై తమ పరిధిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.

రండి రండి దయచేయండి! తమరి రాక మాకెంతో ఆనందం సుమండి! - AP and Telangana CMs Meeting

అధికారులు తొలుత విభజన చట్టంలోని 9,10వ షెడ్యూళ్లలో ఉన్న సంస్థల ఆస్తుల విభజన, ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అంశం, విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు, 15 ఎయిడెడ్‌ ప్రాజెక్టుల రుణ పంపకాలు, రెండు రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడికి సంబంధించిన అంశాలను వివరించారు. ఆయా అంశాలపై ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అన్నింటిపైనా విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు.

సీఎస్‌లు, మంత్రుల కమిటీ పరిధిలో పరిష్కారం దొరకని వాటిపై తమ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బేషజాలు, పంతాలకు వెళ్లకుండా ఆలోచిస్తే కొన్ని సమస్యలు అధికారులే పరిష్కరించగలరన్నారు. సుదీర్ఘ ఉద్యమంతో ఏర్పాటైన తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా వెళ్లాలని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాల పంపిణీపై రెండు రాష్ట్రాలు కలిసి కేంద్రంతో మాట్లాడాలని రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు.

కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని రేవంత్‌రెడ్డి కోరారు. సున్నితమైన రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలను గౌరవించేలా నడుచుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఏపీ, తెలంగాణలో సుపరిపాలన ఉన్నందున రెండు రాష్ట్రాలకు మంచి జరుగుతుందన్న చంద్రబాబు తెలంగాణ అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.

విభజన సమస్యల పరిష్కారానికి రెండు వారాల్లో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఒక్కో రాష్ట్రం నుంచి ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. కమిటీల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్‌లను సీఎంలు ఆదేశించారు. మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై ఉమ్మడి పోరాటం చేయాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. డ్రగ్స్ మహమ్మరి యువతకు శాపంగా మారిందని రేవంత్‌రెడ్డి అన్నారు.

రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా- తెలుగు సీఎంల సమావేశం - CHANDRABABU REVANTH REDDY MEETING

ఇరు రాష్ట్రాలను మాదకద్రవ్యాల రహితంగా మార్చాల్సిన అవసరం ఉందనగా చంద్రబాబు కూడా అంగీకరించారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్​పై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వివరించిన రేవంత్‌రెడ్డి ఏపీ కూడా కలిసి రావాలని కోరగా చంద్రబాబు సమ్మతించారు. రెండు రాష్ట్రాల అదనపు డీజీ స్థాయి అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించినట్లు భట్టివిక్రమార్క తెలిపారు.

ఏపీలో ఇప్పటికే డ్రగ్స్‌ను ఉక్కుపాదంతో అణిచివేయాలనే ఉద్దేశంతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని ఇరు రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరు గ్యారంటీలకు ఎంత ఖర్చవుతుందని తెలంగాణ సీఎస్‌ను ఏపీ సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్న చంద్రబాబు నిధుల సమీకరణ ఎలా చేస్తున్నారని రేవంత్ రెడ్డి నుంచి ఆరా తీశారు.

ఏపీలో కలిపిన ఐదు గ్రామపంచాయతీలను తమకు తిరిగివ్వాలని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పదని ఏపీ అధికారులు చెప్పారు. హైదరాబాద్‌లోని కొన్ని భవనాలు కావాలని ఏపీ అధికారులు కోరగా రేవంత్‌రెడ్డి నిరాకరించినట్లు తెలిసింది. తెలంగాణ అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌లో స్థిరాస్తులు ఇచ్చే పరిస్థితి లేదని ఏపీ ప్రభుత్వం తరపున దరఖాస్తు చేసుకుంటే స్థలం కేటాయిస్తామని చెప్పినట్లు తెలిసింది. అందులో దిల్లీలోని ఏపీ భవన్‌ తరహాలో భవనాలు నిర్మించుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించినట్లు సమాచారం.

Last Updated : Jul 7, 2024, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.