AP Minister Vangalapudi Anitha Counter to Jagan : ఏపీలో శాంతి భద్రతల అంశంపై మాజీ సీఎం జగన్ దిల్లీ వెళ్తే, తానూ దిల్లీ వెళ్లి తేల్చుకునేందుకు సిద్ధమని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సవాల్ చేశారు. బాబాయ్ హత్య కేసు నుంచి మొదలు పెట్టాలా లేక గత 5 ఏళ్లలో శాంతి భద్రతల పైనా, లేక గత నెల రోజుల తెలుగుదేశం పాలనపైనైనా జగన్‌తో దిల్లీలోనే చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు.
శాంతి భద్రతలపై శ్వేతపత్రం : అసెంబ్లీకి వస్తే తన బాగోతాలు బయటపడతాయని డైవర్షన్ పాలిటిక్స్‌ను పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఎంచుకున్నాడని అనిత దుయ్యబట్టారు. ఈ నెల 24న అసెంబ్లీలో రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం పెట్టి ప్రభుత్వం చర్చ చేపడుతోందన్న అనిత, ఆరోజు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని ఆయనకు సవాల్ విసిరారు. దిల్లీ వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో చర్చ తర్వాత కూడా వెళ్లొచ్చిన హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు జగన్ ప్రవర్తనకు చూసి సిగ్గుపడుతున్నారని ధ్వజమెత్తారు.
ఎంపీ మిథున్ రెడ్డి రాకతో - పుంగనూరులో టెన్షన్ టెన్షన్ - AP MP Mithun Reddy pungauru Tour
రాజకీయ హత్యల్లో టీడీపీవారే బాధితులు : జగన్ చెప్పినట్లు నెల రోజుల వ్యవధిలో 36 రాజకీయ హత్యలు జరిగితే ఆ వివరాలు బయటపెట్టాలని మంత్రి అనిత అన్నారు. తప్పుడు సమాచారంతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న జగన్‌పై ప్రభుత్వ పరంగా చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తే, ఇంకా నంగనాచి కబుర్లు చెప్పటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో చనిపోయిన ముగ్గురు తెలుగుదేశం వారేనని వివరాలు వెల్లడించారు. క్రైమ్ నెంబర్లతో సహా తాను బయటపెడుతున్న అధికారిక సమాచారం తప్పని జగన్ చెప్పగలడా అని ప్రశ్నించారు.
రాజారెడ్డి రాజ్యాంగం అమలు : జగన్‌కు మైండ్ సరిగా లేదనే విషయం ప్రజలందరికీ ఎప్పుడో తెలుసుననీ, మరీ ఇంతలా పోయిందన్నది వినుకొండ పర్యటనతో బహిర్గతమైందన్నారు. రాష్ట్రంలో విష సంస్కృతి నాటి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసినందుకే ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారని గుర్తు చేశారు. జగన్ పాలనలో మహిళలు, బాలికలపై నేరాలు రెట్టింపు అయ్యాయని జాతీయ నివేదికలు బయటపెట్టాయని వివరించారు. చిన్నపిల్లలపై ఎక్కడైనా అఘాయిత్యాలు జరుగుతుంటే తన కంటే ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తున్నారన్న అనిత, గత 5 ఏళ్లలో శాంతి భద్రతలపై ఒక్క సమీక్ష అయినా జగన్ చేశాడా అని నిలదీశారు.
ఏపీ మాజీ సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు నమోదు - CASE AGAINST AP EX CM JAGAN
తాట తీసేందుకు సిద్ధం : సెల్ఫ్ ప్రమోషన్ కోసం కోసం ఓ చావుని వేదిక చేసుకున్నాడని మంత్రి అనిత దుయ్యబట్టారు. సీఎం కుర్చీలో కూర్చోటానికి తండ్రి చావుని, సొంత బాబాయ్‌ని హత్య చేయించి, కోడి కత్తి శ్రీనుని బలి చేసి, గులకరాయి డ్రామాలాడిన రాక్షసుడు జగన్ కాదా అని ప్రశ్నించారు. నిన్నటి వరకూ పరదాలు కట్టడానికి, బారికేడ్లు పెట్టడానికే పరిమితమైన పోలీసులు, చంద్రబాబు పాలనలో తప్పు చేసిన వారి తాట తీసేందుకు సిద్ధమవుతున్నారని హెచ్చరికలు పంపారు.
ఏపీలో శాంతిభద్రతలు ఏమీ బాగోలేవు - రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్ - AP EX CM Jagan Fire on TDP Govt