ETV Bharat / state

ఏపీలో 'నైరుతి' ప్రభావం - దంచికొడుతున్న వర్షాలు - పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు - andhra pradesh rains - ANDHRA PRADESH RAINS

Andhra Pradesh Rains: నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలుచోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నారు. వాగులు, వంకలు ఉద్ధృతంగా పొంగిపొర్లుతుండగా రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. అనంతపురం జిల్లా హోసగుడ్డం వద్ద పెద్ద వంక ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాయదుర్గం-బళ్లారి అంతర్రాష్ట్ర రహదారిలో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లాలో చింతకుంట వద్ద తాత్కాలిక వంతెన తెగిపోవడంతో ఆంధ్రా, కర్ణాటకకు రాకపోకలు నిలిచిపోయాయి.

Andhra Pradesh Rains
Andhra Pradesh Rains (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 10:38 AM IST

Andhra Pradesh Rains: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులు ఉరుములతో కూడిన వర్షం పడింది. ఎండ వేడిమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. వర్షాలు పడక చెరువులు. జలాశయాలు ఎండిపోవడంతో అంతర పంటలకు ఈ వర్షం కాస్తంత ఉపశమనాన్ని ఇస్తుందని రైతులు అంటున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి పలుచోట్ల రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎమ్మిగనూరు, గూడూరు, పత్తికొండ, మంత్రాలయంలో ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. హాలహర్వి మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి చింతకుంట వద్ద తాత్కాలిక వంతెన తెగిపోయింది. వంతెన తెగిపోవటంతో ఆంధ్రా, కర్ణాటకకు వెళ్లే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి కురిసిన వర్షానికి వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గట్లన్నీ కోతకు గురై పంట పొలాలు మొత్తం జలమయంగా మారాయి. నంద్యాల జిల్లాలోని మహానంది, కోవెలకుంట్లలో వర్షం కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి.

రాష్టంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు - Southwest Monsoon

Rains in Anantapur District: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో 84.2 వర్షపాతం నమోదైంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బూదగవి వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పొలాలు వర్షపు నీటితో మునిగాయి. అనంతపురంలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండ్ పరిసర ప్రాంతంలోకి భారీగా నీరు చేరింది. రోడ్డుపై నీరు పెద్ద ఎత్తున నిలవడంతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షం పడినప్పుడల్లా ఇబ్బంది పడాల్సి వస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. వేదావతి హగరికి వరద ఉద్ధృతితో కనేకల్-ఉరవకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. డి.హీరేహాల్‌ మండలం చెర్లోపల్లి వద్ద బొమ్మనహల్ సెక్షన్ పరిధిలోని హెచ్‌ఎల్సీ కాల్వకు భారీగా వరద వచ్చింది. చెర్లోపల్లి వద్ద హెచ్‌ఎల్సీ అండర్‌ టన్నెల్‌ ఛానల్‌కు రంధ్రం పడి వంకలోకి వరద నీరు వృథాగా వెళుతోంది. భారీ వర్షానికి మొక్కజొన్న, పత్తి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బొమ్మనహల్ మండలంలో 91.0 మీ.మీ వర్షపాతం నమోదయింది. వేదావతి హగరికి జలకళ సంతరించుకుంది. వేదావతి హగరికి వరద ఉద్ధృతితో కనేకల్-ఉరవకొండ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

వర్షం కారణంగా అల్లూరి జిల్లాలో రాజవొమ్మంగి మండలంలో జాతీయ రహదారి విస్తరణ పనుల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాత్రి కురిసిన వర్షానికి రహదారులు బురదమయం కావడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

ఆరంభానికి ముందే అదరగొడుతున్న రుతుపవనాలు- భారీ వర్షాలు,పిడుగులతో అతలాకుతలం - Rain Disaster in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.