ETV Bharat / state

టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసు - వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు - Notice to YSRCP Central Office

Police Notice to YSRCP Central Office In AP : ఆంధ్రప్రదేశ్​లోని మంగళగిరిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అతికించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీటీవీ ఫుటేజ్​ను సమర్పించాలని పేర్కొన్నారు. అలాగే ఇదే కేసులో వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Police Notice to YSRCP Central Office In AP
Police Notice to YSRCP Central Office In AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 7:39 PM IST

Police Notice to YSRCP Central Office In AP : ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అతికించారు. 2021 అక్టోబర్‌ 19 నాటి సీసీఫుటేజ్‌ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి కుట్ర వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిందని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచే వాహనాల్లో వచ్చారని కూడా అందులో పేర్కొన్నారు.

స్పందించని వైఎస్సార్సీపీ కార్యాలయం : అందుకే ఘటన జరిగిన రోజు వైఎస్సార్సీపీ కార్యాలయం సీసీ ఫుటేజ్ సమర్పించాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ దృశ్యాల ఆధారంగా ఆ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన వారు, టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారు ఎవరెవరనేది తేల్చనున్నారు. సీసీ కెమెరా దృశ్యాలు కావాలని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు అంటించారు. కానీ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి దీనిపై ఎటువంటి స్పందన లేదు.

దేవినేని అవినాష్‌కు పోలీసుల నోటీసులు జారీ : అలాగే ఈ ఘటనలో బాధ్యులుగా ఉన్న వారికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విజయవాడకు చెందిన వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్​తో పాటు అరవ సత్యంకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాము అడిగిన వివరాలు అందజేయాలని నోటీసులలో పేర్కొన్నారు. గుణదలలోని ఆయన ఇంటికి అంటించారు.

తాము చెప్పిన రోజు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీరిద్దరితో పాటు మరికొందరు అనుమానితులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దేవినేని అవినాష్ ఇటీవల విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించగా శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. నిందితులు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు.

TDP Office: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు... మరో ఏడుగురు అరెస్టు

పల్నాడు టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు - వైసీపీ పనేనన్న నేతలు - Fire attack on tdp office

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.