ETV Bharat / state

కోడికత్తి శ్రీను బెయిల్‌ పిటిషన్‌ - విచారణ రేపటికి వాయిదా - కోడి కత్తి శ్రీను బెయిల్‌ పై కోర్టు

Kodi Kathi Srinu bail plea: కోడికత్తి శ్రీను బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టగా, ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది రేపటి వరకూ సమయం కోరడంతో, విచారణను రేపటికి వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

Kodi Kathi Srinu bail plea
Kodi Kathi Srinu bail plea
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 3:38 PM IST

Kodi Kathi Srinu bail plea: కోడి కత్తి శ్రీను బెయిల్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టులో లాయర్లు పిచ్చుక శ్రీనువాసు, పాలేటి మహేష్ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్​పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. శ్రీను ప్రస్తుతం జైళ్లో అమరణ నిరహార దీక్ష చేస్తున్నాడని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని న్యాయవాదులు పిటిషన్​లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గత ఐదేళ్లుగా కారాగారంలో మగ్గుతున్నాడని, న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఎన్ఐఏ తరపు న్యాయవాది రేపటికి సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. ఎన్ఐఏ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఐదేళ్లైనా తెగని కేసు - న్యాయం కోసం జైల్లోనే నిందితుడి దీక్ష, తల్లి, సోదరుడు సైతం

హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలి: మరో వైపు తనకు సీఎం జగన్‌ న్యాయం చేయాలంటూ, కోడి కత్తి శ్రీను ఈ నెల 18వ తేదీ నుంచి జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించింది. సోమవారం న్యాయవాదుల సమక్షంలో దళిత సంఘల నేతలు కోడి శ్రీనుతో ములాఖాత్ అయ్యారు. ఆ సమయంలో ఒక జైలు అధికారి, మరో ఖైదీ శ్రీనును చేతులతో మోసుకొచ్చినట్లు దళిత సంఘ నేతలు వెల్లడించారు. జైల్లో శ్రీను దీక్షను కొనసాగిస్తున్నప్పటికీ, జైలు అధికారులు శ్రీనివాసరావు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయకపోవడంపై విశాఖ దళిత సంఘాల కన్వీనర్‌ బూసి వెంకట్రావు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు కోడి కత్తి శ్రీను హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలని కోరుతూ జిల్లా లీగల్‌ అథారిటీలో న్యాయవాది సలీం పిటిషన్‌ దాఖలు చేశారు.

జగన్ అధికారంలోకి రావడానికే కోడికత్తి కుట్ర ఘటన- న్యాయవాది సలీమ్

విపక్షాల హామీతో దీక్ష విరమించిన శ్రీను తల్లి: ఈనెల 18వ తేదీన తమకు న్యాయం చేయాలంటూ కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు జైల్లో, అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు ఇంట్లో నిరహార దీక్ష చేపట్టారు. అయితే 21వ తేదీన శ్రీను తల్లి సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అనంతరం శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజును విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని టీడీపీ నేత బొండా ఉమ, నక్కా ఆనంద్​బాబు, సీపీఐ నేత రామకృష్ణ తదితరులు పరామర్శించి, శ్రీను తరఫున న్యాయపోరాటం చేస్తామని, దీక్ష విరమించాలని విపక్షాలు విజ్ఞప్తి చేశాయి. విపక్షాల విజ్ఞప్తితో సావిత్రమ్మ, సుబ్బరాజులు దీక్ష విరమించారు. టీడీపీ నేత బొండా ఉమ, సీపీఐ నేత రామకృష్ణ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

విషమించిన కోడి కత్తి శ్రీను తల్లి ఆరోగ్యం - దీక్ష విరమణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.