ETV Bharat / state

దేశంలో రికార్డు నమోదు చేసిన ఏపీ ఓటర్లు- నాలుగో విడతలో అత్యధికంగా 81.86 శాతం పోలింగ్​ - MUKESH KUMAR MEENA ON ELECTIONS - MUKESH KUMAR MEENA ON ELECTIONS

CEO Meena on AP polling percentage: రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్​ కుమార్​ మీనా పూర్తి వివరాలు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 81.66 శాతం పోలింగ్​ నమోదు అయ్యిందని తెలిపారు.

mukesh kumar meena
mukesh kumar meena (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 1:59 PM IST

Updated : May 15, 2024, 10:43 PM IST

CEO Meena on AP polling percentage: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో రాష్ట్రంలో కొత్త రికార్డు నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్ మీనా తెలిపారు. నాలుగుదశల పోలింగ్‌లో దేశంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైందని అన్నారు. ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్‌ నమోదైందని మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ బ్యాలెట్‌తో 1.2 శాతం పోలింగ్‌ నమోదైందని చెప్పారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి తుది పోలింగ్‌ శాతం వివరాలను మీనా వెల్లడించారు. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్‌ కొనసాగిందని తెలిపారు. ఆఖరి పోలింగ్‌ కేంద్రంలో రాత్రి 2 గంటలకు ముగిసిందని అన్నారు.

ఆ ప్రాంతాల్లో తిరిగి పోలింగ్ నిర్వహించాలి - ఈసీకి టీడీపీ నేతల ఫిర్యాదు - TDP leaders complained to EC

రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచినట్లు తెలిపారు. కొన్నిచోట్ల వర్షం వల్ల పోలింగ్ ఆలస్యమైందని అన్నారు. అబ్జర్వర్లంతా పరిశీలన చేశారని రీపోలింగ్‌పై ఏమీ చెప్పలేదని సీఈవో మీనా వివరించారు. గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్‌ పెరిగిందని మీనా తెలిపారు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం నమోదైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు వివరించారు. లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ లోక్‌సభలో 71.11 శాతం పోలింగ్‌ నమోదైనట్లు మీనా తెలిపారు.

హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్​ - 'ఆ ఎమ్మెల్యే'ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశం - MLA house arrest

ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులపై కఠినమైన చర్యలు: ఎన్నికల విధుల్లో కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు గుర్తించామని సీఈవో అన్నారు. ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని డీజీపీ సహా ఉన్నతాధికారులంతా గుర్తించే పనిలో ఉన్నారని తెలిపారు. ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులందరిపైనా కచ్చితంగా చర్యలు ఉంటాయని అన్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడినవారి ఫొటోలు, వీడియోలతో సహా ఆధారాలు మావద్ద ఉన్నాయని సీఈవో తెలిపారు. తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట ఘటనల్లో అందరినీ గుర్తించామని ఇప్పటికే చంద్రగిరిలో 30 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. హింసాత్మక ఘటనలకు కారకులైన అభ్యర్థులను గృహనిర్బంధంలో ఉంచినట్లు సీఈఓ మీనా తెలిపారు.

జగన్‌ ప్లాన్​ను అడ్డుకున్న ఈసీ! పోలింగుకు ముందు రూ.14,165 కోట్ల పంపిణీకి స్కెచ్‌ - EC Orders to AP Govt

Last Updated : May 15, 2024, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.