ETV Bharat / state

'కోడ్‌' కూయగానే ఇవి అమలు చేయాల్సిందే'

Model Code of Conduct in Andhra Pradesh: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు ఆస్తుల వద్ద ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు వాల్ పేపర్లు, బ్యానర్లు, కటౌట్ లు తొలగించాలని ఆదేశిస్తూ ఈసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు మంత్రులు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సులపైనా నిషేధం అమలవుతుందని మార్గదర్శకాల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం పేర్కొంది.

Model Code of Conduct in Andhra Pradesh
Model Code of Conduct in Andhra Pradesh
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 6:52 AM IST

'కోడ్‌' కూయగానే ఇవి అమలు చేయాల్సిందే'

Model Code of Conduct in Andhra Pradesh: సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, ఆస్తుల వద్ద అమలు చేయాల్సిన మార్గదర్శకాలపై ఈసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటన తర్వాత కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధాని ఫోటోలను తొలగించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల షెడ్యూలు వెలువడిన వెంటనే: కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ భవనాలు, ఆస్తుల వద్ద రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్ లు, హోర్డింగ్ లు, పోస్టర్లు, గోడరాతలు తొలగించాలని ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రహదారులు, బస్సులు, విద్యుత్ స్థంభాలు, మున్సిపల్ కార్యాలయాల స్థలాల వద్ద ప్రకటనలు, హోర్డింగులపై రాజకీయ పార్టీ నేతలు, ప్రకటనలు, పోస్టర్లు తొలగించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు. ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రభుత్వ పథకాల ప్రకటనలు కూడా నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన వెంటనే అన్ని ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలను తొలగించాల్సిందిగా స్పష్టం చేశారు. అభివృద్ధి, నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా ఆయా ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే మంత్రులకూ ప్రభుత్వ అధికారిక వాహనాల వినియోగం నిలిపివేయాల్సిందిగా సూచనలు జారీ చేశారు.
సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా అందించవద్దు: నిమ్మగడ్డ రమేష్ కుమార్

పూర్తి నిషేధం వర్తిస్తుంది: మరోవైపు ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైన అధికారులు, అధికారయంత్రాంగం బదిలీలపై పూర్తి నిషేధం అమలు అవుతుందని ఈసీ స్పష్టం చేసింది. మంత్రులు, రాజకీయ నేతలతో అధికారుల వీడియో కాన్ఫరెన్సుల పైనా పూర్తి నిషేధం వర్తిస్తుందని ఈసీ తేల్చి చెప్పింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక లబ్దిదారులకు ఇచ్చే పత్రాలపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన ప్రకటనలు, హోర్డింగ్ లు కూడా తక్షణం తొలగించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు పైలట్ కార్లు, సైరన్ వినియోగించకూడదని వెల్లడించారు.
తెలంగాణలో ప్రధాని మోదీ రోడ్​షో - కాషాయమయమైన రహదారులు

వారిపై క్రిమినల్ కేసులు నమోదు: ప్రభుత్వ అతిథి గృహాలనూ మంత్రులు, ప్రజాప్రతినిధుల్ని ఖాళీ చేయించాలని స్పష్టం ఈసీ స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఉద్దేశపూర్వకంగా సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు అవుతాయని వెల్లడించింది.ఈమేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు, హెచ్ఓడీలకు, కలెక్టర్లకు , డీజీపీకి, ఎస్పీలకు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మార్గదర్శకాలు జారీ చేశారు.

శనివారం ఇడుపులపాయకు సీఎం జగన్ - వైసీపీ అభ్యర్థులు, మేనిఫెస్టో ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.