ETV Bharat / state

అబ్బురపరిచిన శిలంబం పోటీలు - దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ఔత్సాహికులు - Ancient Martial Art Silambam - ANCIENT MARTIAL ART SILAMBAM

Ancient Martial Art Silambam Asian Championship Competitions in Guntur: ప్రాచీన యుద్ధ క్రీడలో సాటిలేనిది శిలంబం. ఇదో ఆట మాత్రమే కాదు ఆత్మ సంరక్షణకి తోడ్పడే అద్భుత ఆయుధం కూడా. అలాంటి క్రీడలో రాణించాలంటే మాటలు కాదు. ఎంతో నేర్పు, పట్టుదల ఉండాలి. కానీ, గత కొంతకాలంగా ఆదరణ తగ్గుతూ వస్తుంది. అంతరించిపోతున్న ఈ కళా వైభవం ప్రాముఖ్యత తెలియజేయడానికి గుంటూరు జిల్లా వేదికైంది. దేశ నలుమూలాల నుంచి ఆసక్తి గల యుద్ధవీరులు ఒక్కచోట చేరి అదరగొట్టారు. మరి, ఆ యుద్ధక్రీడ ప్రదర్శన ఎలా సాగింది? క్రీడాకారులు ఎలా రాణించారో ఈ కథనంలో చూద్దాం.

Ancient Martial Art Silambam Asian Championship Competitions in Guntur District
Ancient Martial Art Silambam Asian Championship Competitions in Guntur District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 10:22 PM IST

అబ్బురపరిచిన శిలంబం పోటీలు - దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ఔత్సాహికులు (ETV Bharat)

Ancient Martial Art Silambam Asian Championship Competitions in Guntur : ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రాచీన యు‌ద్ధ క్రీడ శిలంబం శారీరక వ్యాయామంగానే కాకుండా మహిళల ఆత్మ రక్షణ కోసం కూడా ఎంతో ఉపయోగపడుతోంది. అందుకే వేరు వేరు వృత్తుల్లో స్థిరపడినా ప్రాచీన యుద్ధ విద్య శిలంబం పట్ల ఆకర్షితులయ్యారు ఎంతో మంది యువతీ యువకులు. చాలా మంది ఎక్కడ పోటీలు నిర్వహించినా ఉత్సాహంగా పాల్గొని అనేక పతకాలు సాధిస్తున్నారు.

జీఎంఆర్‌ ఐటీ వేదికగా స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు

భారతీయ యుద్ధ విద్యల్లో శిలంబంకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి యుద్ధ విద్య పోటీలకు వేదికైంది గుంటూరు జిల్లా నూతక్కిలోని విజ్ఞానవిహార పాఠశాల. వరల్డ్ యూనియన్ సిలంబం ఫెడరేషన్‌, WSS స్పోర్ట్స్ సంయుక్తంగా శిలంబం ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఈ పోటీల్లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రాచీన యుద్ధ విద్యకు ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు క్రీడాకారులు. మొత్తం 254 మంది పాల్గొన్న ఈ పోటీల్లో కర్రసాము సింగిల్, డబుల్ స్టిక్, స్వార్డ్, ఫైటింగ్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కర్రసాము, కత్తిసాములో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ అబ్బురపరిచారు.

వినూత్న ఆవిష్కరణలకు రూపకల్పన - యువతకు ఆదర్శం

నిత్యం కఠోర సాధన చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు రాబడుతున్న వారిలోచాలా మంది వివిధ వృత్తులు చేస్తున్న వారే. అంతేగాక 10ఏళ్ల చిన్నారుల నుంచి 35 ఏళ్ల యువకుల వరకు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కర్రను క్రమ పద్ధతిలో తిప్పుతూ అందరినీ ఆకర్షిస్తోన్న క్రీడాకారులు అంతరించిపోతున్న ప్రాచీన యుద్ధ విద్యను తమ వంతుగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నారు. తమిళనాడు వెల్లూరుకు చెందిన కార్తీక సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, ఫైటింగ్‌ల్లో అద్భుత ప్రతిభ కనపరిచి మూడు విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది.

"నేటి సమాజంలో శిలంబం అనేది మహిళలకు ఎంతో అవసరం. మాది గుంటూరు. ఓ వైపు వైద్యురాలిగా ప్రాక్టీస్ చేస్తూనే శిలంబంపై మక్కువతో కర్రసామును నేర్చుకున్నాన్నాను. ఈ విద్య యువతులకు అండగా ఉండటంతో పాటు ఫిట్‌నెస్‌కు చాలా ఉపయోగపడుతుంది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాన్ని సైతం సాధించాను." - డా.దీప్తి, శిలంబం క్రీడాకారిణి

ఇలాంటి పోటీల్లో పాల్గొన్నప్పుడు కొత్త కొత్త మెళకువలు నేర్చుకునే అవకాశం ఉంటుందని స్థానిక క్రీడాకారులు చెబుతున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఏషియన్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగటం మంచి పరిణామమని అయితే, శిలంబంను రాష్ట్ర క్రీడగా గుర్తిస్తే క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కరాటేలో 74 పతకాలు సాధించిన సందీప్ కుమార్‌ - పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.