ETV Bharat / state

ఏటీఎంలే లక్ష్యం - పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా - Police Arrested Interstate Robbers - POLICE ARRESTED INTERSTATE ROBBERS

Anantapur Police Arrested Interstate Robbers Gang: రెక్కీ నిర్వహించి ఏటీఎంలలో చొరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను ఎస్పీ జగదీష్ వెల్లడించారు. హర్యానాకు చెందిన కొంతమంది ​ఏటీఎంల వద్ద రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్నారని వివరించారు.

police_arrested_interstate_robbers
police_arrested_interstate_robbers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 5:55 PM IST

Anantapur Police Arrested Interstate Robbers Gang: అతనో లారీ డ్రైవర్​. హర్యానాలో ఉంటూ వివధ రకాల సరకులను ఆంధ్రప్రదేశ్​కు లారీలో తీసుకువస్తుంటాడు. అలా వచ్చి వెళ్తుంటే బాగానే ఉండేది. కానీ అతను చేసే పని మరొకటి ఉంది. సరకులను డౌన్​లోడ్​ చేసి వెళ్తూ జాతీయ రహదారి పక్కన ఉండే ఏటీఎంలపై కన్నేస్తాడు. జన సంచారం లేని, కాపలదారు లేని కేంద్రాలను పరిశీలించి హర్యానాలోని తన ముఠా సభ్యులైన రాబిన్​, సలీంలు సమాచారమిస్తాడు.

అంతే రాబిన్​, సలీంలు రంగంలోకి దిగుతారు. అర్ధరాత్రి కొంతమందిని తమతోపాటు తీసుకువచ్చి ఏటీఎంలను కొల్లగొడతారు. తస్కరించిన నగదును వెంటనే లారీ డ్రైవర్​, వాళ్లకు సమాచారమిచ్చిన షాకీర్​తో హర్యానాకు లారీలో పంపిస్తూ ఉంటారు. అంతా సద్దుమణిగిన తర్వాత అక్కడ వాటాలు పంచుకుంటారు. వీళ్లు ఎక్కువగా కొల్లగొట్టిన ఏటీఎంలు ఎస్బీఐకు చెందినవే ఉంటాయని పోలీసుల విచారణలో బయటపడింది.

ఎలా చిక్కారంటే?: ఈ నెల 4న అనంతపురంలోని రామనగర్​ కాలనీ ప్రధాన రహదారిలో ఉన్న ఏటీఎంలో దోపిడీ జరిగింది. 30 లక్షల రూపాయలు చోరీ కావడంతో సీసీఎస్​, అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అంతర్రాష్ట్ర దొంగలైన హర్యానా ముఠా గుట్టు బయటపడిందని ఎస్పీ జగదీష్​ తెలిపారు. సినిమా తరహాలో రెక్కీ నిర్వహించి దోపిడీలకు పాల్పడుతుంటారని అన్నారు.

ఎస్బీఐకి ఎక్కువ మంది వినియోగదారులు ఉండటం, ఏటీఎంలలో అధికంగా నగదు పెట్టడంతో పాటు ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డులు లేకపోవడం ఈ ముఠా దోపిడీలు చేసేందుకు కలిసి వచ్చిందని చెప్పారు. ఈ ముఠా ఏపీతో పాటు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 9 ఏటీఎం కేంద్రాల్లో దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారని ఎస్పీ జగదీష్​ తెలిపారు.

నెల్లూరులో రెచ్చిపోయిన గంజాయి మాఫియా - డీఎస్పీని కారుతో ఢీకొట్టి పరార్ - nellore rural dsp hit by vehicle

ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు జిల్లా చెప్పారు. నిందితులను విచారించాక, ఇప్పటి వరకు 4 ఏటీఎంలలో దోచుకున్నట్లు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. ఏటీఎంలలో దోపిడీలు జరిగినపుడు చాలా సందర్భాల్లో నగదు రికవరీ సాధ్యం కాదని, అయితే ప్రస్తుతం నిందితుల నుంచి 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జగదీష్ చెప్పారు.

త్వరలోనే పోలవరం డీపీఆర్‌కు ఆమోదముద్ర - అందుబాటులోకి రానున్న 12 వేల కోట్లు - Polavaram Project DPR

ఆంధ్రప్రదేశ్ తీరానికి కోత ప్రమాదం - అంతరిక్ష కేంద్రానికి సైతం ఎదురవుతున్న సవాళ్లు - Coastal Erosion in Andhra Pradesh

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.