Anantapur Police Arrest Cyber Criminals : ఇటీవల కాలంలో ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నఫలంగా డబ్బులు మాయం అవుతున్నాయి. డబ్బులను ఎవరు కాజేస్తున్నారో? ఎలా కాజేస్తున్నారో అంతుచిక్కకపోవటంతో బాధితులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు అనంతపురం పోలీసులు రంగంలోకి దిగారు. సైబర్ నేరగాళ్ల ఆటలకు కళ్లెం వేస్తున్నారు.
సైబర్ ముఠా అనంతపురం పోలీసుల నిఘా : బ్యాంకు ఖాతాల నుంచి నగదు దోచుకునే బీహార్ సైబర్ ముఠా సభ్యులను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆధార్ నెంబర్ ఆధారంగా నగదు విత్ డ్రా చేసుకునే వినియోగదారుల ఖాతాలే లక్ష్యంగా దోచుకుంటున్న సైబర్ ముఠాపై అనంతపురం పోలీసులు గత కొన్నిరోజులుగా నిఘా పెట్టారు. బ్యాంకు ఖాతాల నుంచి నగదు దోచుకుంటున్నారని ఖాతాదారుల నుంచి వస్తున్న అనేక ఫిర్యాదులపై దృష్టి పెట్టిన అనంతపురం పోలీసులు, బీహార్‌కు వెళ్లి సైబర్ ముఠాలోని ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
బీహార్‌లో నిందితులు అరెస్టు : జిల్లా ఎస్పీ అన్బురాజన్ వివరాలు మీడియతో వెల్లడించారు. అనంతపురంలో ఐదు ఖాతాల నుంచి పది వేల రూపాయల చొప్పున సైబర్ నేరగాళ్లు కాజేశారని తెలిపారు. దీనిపై ఫిర్యాదులు రావటంతో దర్యాప్తు ప్రారంభించిన సైబర్ పోలీసులు నేరగాళ్లు బీహార్ రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తించామని పెర్కోన్నారు. అనంతపురం పోలీసుల బృందం బీహార్‌కు వెళ్లి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్లీఆర్పీ, 1930 నెంబర్లకు ఫిర్యాదుల ఆధారంగా ఐదు మంది ఫిర్యాదులతో కేసును ఛేదించినట్లు ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు.
ATM Theft Gang: ఏటీఎం డిపాజిట్ మెషీన్లే టార్గెట్.. నగదు డ్రా చేసుకుని రాలేదంటూ..
305 Cell Phones Recovery in Anantapur : అనంతపురం పోలీసులు 56 లక్షల రూపాయల విలువైన 305 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందచేశారు. చాట్ బాట్ సాఫ్ట్ వేర్ సహాయంతో సెల్ పోగొట్టుకున్న, దొంగతనం అయిన సెల్ పోన్లను అనంతపురం పోలీసులు గుర్తించి నిందితులను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే 305 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందచేశారు. వీటిలో 271 ఫోన్లు అజాగ్రత్తతో పోగొట్టుకున్నవి కాగా, 34 మంది నుంచి దొంగలు కొట్టేశారని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ చెప్పారు. అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 13.67 కోట్ల రూపాయల విలువైన 8309 సెల్ ఫోన్లను రికవరి చేసి బాధితులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. అపరిచిత వ్యక్తులతో ఫోన్లు కొనుగోలు చేయవద్దని ఎస్పీ అన్బురాజన్ సూచించారు.
కులగణనలో వేలిముద్ర - బ్యాంక్ ఖాతాలో డబ్బులు మాయం