ETV Bharat / state

కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీఆర్ బాండ్స్ అవినీతిపై విచారణ చేయిస్తాం: ఆనం - Anam on TDR Bonds

Anam Venkataramana Reddy on TDR Bonds Corruption: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీఆర్ బాండ్స్​పై జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తాం టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ అవినీతిపై సంబంధం ఉన్న తిరుపతి కలెక్టర్, నగర కమిషనర్ హరితపై విచారణ చేయిస్తామని అన్నారు. ఈ క్రమంలో టీడీఆర్ బాండ్స్​ను ఆనం దగ్ధం చేశారు.

anam_on_tdr_bonds
anam_on_tdr_bonds
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 5:18 PM IST

కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీఆర్ బాండ్స్ అవినీతిపై విచారణ చేయిస్తాం: ఆనం

Anam Venkataramana Reddy on TDR Bonds Corruption: సీఎస్​ జవహర్ రెడ్డికి పింఛన్​లు ఇవ్వడం ఇష్టంలేదని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ కాదని, వైసీపీకి చీఫ్ సెక్రటరీ అని విమర్శించారు. పింఛన్ల పంపిణీకి ఉద్యోగులు లేరని సీఎం విచిత్ర మాటలు చెబుతున్నాడని విమర్శించారు. వేల మంది ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారని, వారిలో కొందరిని రోజుకు ఒక్క గంటసేపు వినియోగించుకుంటే వృద్ధులకు, వికలాంగులకు పింఛన్​లు అందించవచ్చునని చెప్పారు. ఈ సమస్య వల్ల 13 మందిని జగన్ మోహన్ రెడ్డి బలితీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్​మే నెల పింఛన్​లో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

గోదావరి జిల్లాల్లో ఆయన ఓ అరాచక 'గ్రంథం'! - YCP leader irregularities

టీడీఆర్ బాండ్స్​పై విచారణ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీఆర్ బాండ్స్​పై జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ అవినీతిపై సంబంధం ఉన్న తిరుపతి కలెక్టర్, నగర కమిషనర్ హరితపై విచారణ చేయిస్తామని అన్నారు. ఈ క్రమంలో టీడీఆర్ బాండ్స్​ను ఆనం దగ్ధం చేశారు. జగన్ మోహన్ రెడ్డితో పాటు, కరుణాకర్ రెడ్డి, అభినయరెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మరి కొందరు ఈ కుంభకోణంలో సూత్రదారులు, పాత్రదారులు అంటూ విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే వైసీపీ అక్రమాలపై విచారణ జరిపిస్తామని బలవంతంగా భూములు తీసుకున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.

అక్రమమైన సక్రమమైన ఆ వైఎస్సార్సీపీ నేతకు కప్పం కట్టాల్సిందే! - YCP leader irregularities in AP

ఆఫ్ టిక్కెట్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల క్రితం నెల్లూరు వచ్చి ముద్దులు పెట్టాడని ఆ తర్వాత మళ్లీ ఈ రోజు వచ్చారని విమర్శించారు. అవినీతిపరుడు అవినీతి వద్దు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రోడ్డు విస్తరణకు ఇచ్చే టీడీఆర్ బాండ్స్​లో వేల కోట్లు అక్రమాలు వెలుగులోకి తెచ్చాం అని ఆనం చెప్పారు. మున్సిపల్ చీఫ్ సెక్రటరి శ్రీలక్ష్మీ ఇవి దొంగ బాండ్లు అని ఎన్నికలు వస్తున్న సమయంలో బయట పెట్టిందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తుందని బయపడి బహిర్గతం చేసిందని అన్నారు. వేల కోట్లు కుంభకోణం బయట పెడితే అందులో 2వేల కోట్లు బాండ్లు అమ్మకాలు పెట్టారని చెబుతున్నారు మరి మిగిలిన కుంభకోణం విషయం మాటేమిటని ప్రశ్నించారు.

నేను బయటకు వెళ్లాక నరికి చంపినా ఆశ్చర్యపడనక్కర్లేదు: సునీత - YS Vivekananda Reddy murder Case

అప్పటి తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డి , కమిషనర్ హరితను అరెస్ట్ చేయాలి. కమిషనర్ హరిత ఆమె తమ్ముడిని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలు చేశారని విమర్శించారు. ఇందులో ఆర్డీఓ కూడా సూత్రదారి అని చెప్పారు. రెవిన్యూ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గూండాలను పెట్టి బెదిరించి భూములు తీసుకున్నారు. 10 వేల నుంచి 20 వేలు ఉండే వ్యవసాయ భూమిని లక్ష నుంచి 2 లక్షలు కమర్షియల్​గా మార్చి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్​గా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి రాగానే టీడీఆర్ బాండ్స్​లో మోసపోయిన వారికి న్యాయం చేస్తాం అని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.