ETV Bharat / state

'ప్లీజ్​ రేవంత్​ తాతయ్య - మా మమ్మీ-డాడీ కాంగ్రెస్​కే ఓటేసిర్రు - మా కాలనీకి రోడ్డేయండి' - Boy Request to CM Revanth For Road

Boy Video Message on Road Problem : ఆడుకునే వయసులో అభివృద్ధి కోసం అర్జీ చేశాడు ఓ బాలుడు. అది కూడా ఎవరికో సాదాసీదా వ్యక్తికి కాదు. ఏకంగా ముఖ్యమంత్రికే సోషల్ మీడియా వేదికగా తమ సమస్యను విన్నవించాడు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు గుంతలుగా మారిన తమ డివిజన్​లో రోడ్లను బాగు చేయాలంటూ, ప్లీజ్ రేవంత్ రెడ్డి తాతయ్య అంటూ ముఖ్యమంత్రిని వేడుకున్నాడు. ఆ బాలుడు వేడుకోలు వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Boy Video Message on Road Problem
Boy Request to CM Revanth For Road (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 21, 2024, 8:22 PM IST

Boy Request to CM Revanth For Road : ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా గుంతలుగా ఉన్న రోడ్లు కాస్త వర్షపు నీరుతో బురదమయంగా మారాయి. గుంతలుగా మారిన రోడ్లను చూసి 8 సంవత్సరాల విశ్వజిత్ అనే బాలుడు వినూత్నంగా తన విన్నపాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఈ విన్నపం వీడియో కాస్త ప్రస్తుతం వైరల్​గా మారింది.

జవహర్ నగర్ 28వ డివిజన్​లోని శ్రీ లక్ష్మీనరసింహ కాలనీలోని రోడ్లన్నీ బురదమయంతో ఉన్నాయని, దాంతో వచ్చే పోయే వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారని తెలిపాడు. రోడ్లపై నడిచే పాదచారులు ఇబ్బంది పడుతున్నారని, ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదని వాపోయాడు.

"మా రోడ్లు చూశారా ఎంత దారుణంగా ఉన్నాయో? ఈ దారుల గుండా బడికి వెళ్లాలంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలా మంది వాహనదారులు బైకులు స్కిడ్​ అయి కిందపడుతున్నారు. రోడ్ల కోసం ఎవరికి చెప్పినా పట్టించుకోవటం లేదు. మీరైనా పట్టించుకోండి రేవంత్​రెడ్డి తాతయ్యా. గతంలో కేసీఆర్, మల్లారెడ్డి గెలిచారు. వాళ్లు ఏమీ చేయలేదు. మీరైనా కాస్త ఈ రోడ్ల పరిస్థితులపై ఆలోచన చేయండి. ప్లీజ్​ ప్లీజ్​ రేవంత్​ రెడ్డి తాతయ్యా!" - విశ్వజిత్, బాలుడు

ఆడుకునే వయసులో అభివృద్ధి కోసం అర్జీ : ఈ బురదతో ఉన్న రోడ్ల వల్ల కాలనీలో ఉన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. గత ప్రభుత్వం, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధికారంలో ఉన్నా రోడ్లు వేయలేదని, రేవంత్ రెడ్డికి ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి రోడ్లు వేస్తారని తమ తల్లిదండ్రులకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పానంటూ విశ్వజిత్ చెప్పాడు. రహదారి విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని రహదారి నిర్మాణాన్ని చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎవరు స్పందిస్తారో వేచి చూడాలి.

కుమురంభీం ఆసిఫాబాద్ అడవుల్లో చెట్టు ఎక్కుతూ 15 అడుగుల కొండచిలువ - సోషల్ మీడియాలో వీడియో వైరల్ - Python Virial Video In Adilabad

రియల్ 'సింగం'- లారీకి ఎదురెళ్లి మరీ పోలీస్​ డ్యూటీ! తొక్కించేందుకు ప్రయత్నించినా తగ్గేదేలే - Policeman Stopping Truck

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.