Allu Arjun Bail Plea Verdict Postponed : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వొదంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ ఇవ్వాలంటూ వాదనలు వినిపించారు. సంధ్య థియేటర్ ఘటనకు అల్లు అర్జున్‌కు సంబంధం లేదని, రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పెట్టిన కేసు వర్తించదని వివరించారు. బీఎస్‌ఎన్ సెక్షన్ 105 వర్తించదని కోర్టుకు తెలిపారు. రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.
గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు : అల్లుఅర్జున్ వివాదంపై పవన్
ఈ నెల 4న పుష్ప బెనిఫిట్ షో రోజు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, ఈ నెల 27న రిమాండ్ ముగిసింది. అదే రోజు ఆయన వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అప్పుడే ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ వాయిదా పడగా, సోమవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది.
'అల్లుఅర్జున్ అభిమానుల నుంచి మాకు ప్రాణహాని - చంపేస్తామంటూ వందల కాల్స్'