All parties Election Campaign in Andhra Pradesh : రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి. తమ పార్టీని గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థులు నియోజకవర్గాల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదే క్రమంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగాయి.
జోరుగా ఎన్నికల ప్రచారం- జగన్ వైఫల్యాలను ఎండగడుతున్న కూటమి అభ్యర్థులు
కూటమి అభ్యర్థులకు మద్దతుగా సైకిల్ ర్యాలీ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ప్రచారానికి ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సౌమ్యకు మహిళలు పూలమాలలు, శాలువాలు, హారతులతో స్వాగతం పలుకుతున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా గుంటూరులో సైకిల్ ఫిట్‌నెస్ గ్రూప్స్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి మాధవితో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజవర్గంలో కూటమి అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, మాధవి అపార్ట్‌మెంట్ వాసులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు.
బాలకృష్ణకు మద్దతుగా వసుంధర ఎన్నికల ప్రచారం : బాపట్ల జిల్లా అద్దంకి మండలం కొంగపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌కు గ్రామస్తులు పూలవర్షంతో స్వాగతం పలికారు. పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చిమ్మిరిబండ, రాజుగారిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజవర్గ కూటమి అభ్యర్థి MS రాజు అగళి మండలంలో ప్రచారం నిర్వహించారు. జిల్లాకు ఇంఛార్జి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని రాజు ఆరోపించారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని కొల్లకుంట, కొట్నూరు, ఇందిరమ్మ కాలనీ, చౌడేశ్వరి కాలనీలో కూటమి అభ్యర్థి బాలకృష్ణకు మద్దతుగా ఆయన సతీమణి వసుంధర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సూపర్ సిక్స్ పథకాలపై విస్తృత ప్రచారం : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆలూరు కూటమి అభ్యర్థి వీరభద్రగౌడ్ హాలహర్వి మండలంలోని అర్ధగేరి, మెదేహాల్, కామినహాల్, చింతకుంట గ్రామాల్లో పర్యటించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నంద్యాల జిల్లా పాణ్యం కూటమి అభ్యర్థి గౌరు చరిత ప్రచారంలో కొణిదేడు, కందికాయపల్లె గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. డోన్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దొరపల్లి, లక్ష్యం పల్లి, మల్లంపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. దొరపల్లిలో 50 కుటుంబాలు వైసీపీ వీడి కోట్ల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.
పూలవర్షంతో అపూర్వ స్వాగతం : అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాడు, లక్ష్మీ పోలవరం, వేదిరేశ్వరంలో కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పలువురు వైసీపీను వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ చైతన్య రథయాత్ర నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం కుసులవాడలో భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు గ్రామస్థులు పూలవర్షంతో అపూర్వ స్వాగతం పలికారు. గిడిజాల, దబ్బంద గ్రామాల్లో గంటా ఎన్నికల ప్రచారానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని మొండెంఖల్లులో కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలసలో కూటమి అభ్యర్థి ఈశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రచారంలో కన్నీటిపర్యంతమైన టీడీపీ అభ్యర్థి - Vemireddy Prashanthi Reddy
వైసీపీని వెంటాడుతున్న వలసల భయం - బడా నేతలు సైతం పార్టీకి 'బైబై' - YCP LEADERS JOINING TDP