ETV Bharat / state

మూడు సార్లు విఫలం- నాల్గోసారి విజయం! ఐఎఫ్​ఎస్​తో అమ్మను గెలిపించాడు - IFS top ranker Krishna interview - IFS TOP RANKER KRISHNA INTERVIEW

IFS top ranker Tummala Krishna Chaitanya Success Story: మూడుసార్లు ప్రయత్నించి విఫలం అయినా ఆ యువకుడు కృంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో నాగుగోసారి ప్రయత్నించి ఆల్‌ ఇండియా లెవల్‌లో ఐఎఫ్​ఎస్​-74 ర్యాంకు సాధించాడు. అఖిల భారత స్థాయి పోలీసు అధికారిగా చూడాలన్న అమ్మ కలను నెరవేర్చాడు.

IFS_Top_Ranker_Tummala_Krishna_Chaitanya_Success_Story
IFS_Top_Ranker_Tummala_Krishna_Chaitanya_Success_Story (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 4:46 PM IST

IFS top ranker Tummala Krishna Chaitanya Success Story: అతడు చదివింది కెమికల్‌ ఇంజినీరింగ్‌. కానీ మానవ మనుగడకు ప్రకృతే కారణమని నమ్మిన ఆ యువకుడు ఫారెస్ట్ ఆఫీసర్‌ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తూనే నిరంతరం శ్రమించాడు. మూడుసార్లు ప్రయత్నించి విఫలం అయినా మొక్కవోని ధైర్యంతో నాలుగోసారి ప్రయత్నించి విజయం సాధించాడు. అఖిల భారత స్థాయి పోలీసు అధికారిగా చూడాలన్న అమ్మ కలను నెరవేర్చాడు.

సైంటిఫిక్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ విధానం అమలు చేసి అడవులను రక్షించడం, గిరిజనుల జీవన విధానాన్ని మార్చేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం, వణ్యప్రాణుల సంరక్షణ సహ, అటవీ సంపద స్మగ్లింగ్ నివారణే తన లక్ష్యమని ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఐఎఫ్​ఎస్ జాతీయ స్థాయి ర్యాంకర్ తుమ్మల కృష్ణ చైతన్య తెలిపారు. ప్రజలకు అడవుల పెంపకం ప్రాధాన్యత తెలిపి పెంపొందించడం సహా అడవి బిడ్డలైన గిరిజనుల జీవితాల్లో వెలుగు తీసుకురావడమే తన ప్రాధాన్యత అని తెలిపారు.

జీఎంఆర్‌ ఐటీ వేదికగా స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు

లక్ష్య సాధనలో తన తల్లిదండ్రులు, భార్య ఎంతో ప్రోత్సహించారని, కష్టకాలంలో అండగా నిలబడి ధైర్యాన్ని, భరోసా ఇచ్చారని తద్వారా ఉత్తమ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. తాను జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడంలో ఈనాడు పత్రిక ఎంతో ఉపయోగపడిందని కృష్ణ చైతన్య తెలిపారు. ఫారెస్టు సర్వీస్ అనేది దేశాభివృద్ధిని, పర్యావరణ సమతుల్యతను ప్రభావితం చేసే విభాగమని సివిల్స్​కు ప్రిపేర్ అయ్యే వారు ఐఎఫ్​ఎస్ సర్వీస్​ను ఎంపిక చేసుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు.

స్పష్టమైన గోల్​ను ఏర్పాటు చేసుకుని నిర్దేశిత ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివితే సివిల్స్​లో విజయం సాధించడం చాలా సులువని ఈ దిశగా నేటి తరం యువత కృషి చేయాలన్నారు. తనను అఖిల భారత స్థాయి పోలీసు అధికారిగా చూడాలన్న అమ్మ, అమ్మమ్మ కల నెరవేర్చడమే ధ్యేయంగా సివిల్స్ వైపు అడుగులు వేసి చివరకు ఐఎఫ్​ఎస్ అధికారిగా విజయం సాధించినట్లు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే, కష్టపడి చదివానని, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవడం, షెడ్యూల్​ను రూపొందించుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదవి ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దుకోవడం వల్లే నాలుగో ప్రయత్నంలో 74వ ర్యాంకు సాధించగలిగానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆల్‌ ఇండియా లెవల్‌లో ఐఎఫ్​ఎస్​-74 ర్యాంకు సాధించిన క్రిష్ణతో మా ప్రతినిధి ముఖాముఖి.

ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్​డీ - కర్ణాటక గవర్నర్​ నుంచి పట్టా అందుకున్న యువకుడు

మూడు సార్లు విఫలం- నాల్గోసారి విజయం! (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.