ETV Bharat / state

YUVA : పేదరికం వెంటాడుతున్నా తగ్గలేదు - పార్ట్​టైం జాబ్ చేస్తూ తెలుగు కబడ్డీ లీగ్​కు ఎంపికైన నల్గొండ వాసి - Kabaddi Player Ajay From Yadadri - KABADDI PLAYER AJAY FROM YADADRI

Kabaddi Player Ajay From Yadadri : పేదరికం ఇబ్బందులు పెడుతున్న సోదరి ప్రోత్సాహంతో కబడ్డీ క్రీడలో మెళకువలు నేర్చుకున్నాడు ఈ యువకుడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటాడు. అండర్ 19 జాతీయ స్థాయిలో పాల్గొని మెుదటి బహమతి సాధించాడు. ఇటీవల నిర్వహించిన అండర్ 21 తెలుగు కబడ్డీ లీగ్‌కు ఎంపికయ్యాడు ఈ క్రీడాకారుడు.

Kabaddi Player Ajay From Yadadri Selected For TKL
Kabaddi Player Ajay From Yadadri Selected For TKL (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 3:32 PM IST

Kabaddi Player Ajay From Yadadri Selected For TKL : కబడ్డీ ఆడుతున్న ఈ యువకుడి పేరు గొలనుకొండ అజయ్. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జంపల్లి స్వస్థలం. తండ్రి చిన్నప్పుడే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. 11 ఏళ్ల వయస్సులో తల్లి అనారోగ్యంతో మరణించింది. దిక్కుతోచని స్థితిలో పడ్డ తనను సోదరి సుస్మిత ఆమె భర్త పెంచారు. భువనగిరి మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించారు. కబడ్డీ అంటే మక్కువ ఉండటంతో పాఠశాల స్థాయి నుంచే సాధన ప్రారంభించాడు అజయ్.

పార్ట్​టైమ్​ జాబ్​ చేస్తూ శిక్షణ : పాఠశాల రోజుల నుంచి క్రీడల్లో రాణిస్తున్నాడు అజయ్. జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. చేసేది లేక ఓపెన్ డిగ్రీలో చేరాడు. అక్కాబావలకు భారం కాకుడదని పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇష్టమైన కబడ్డీలో రాణించాలని సాధన చేస్తున్నాడు.

ఆటపై మక్కువతో ఆడిన ప్రతిపోటీలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు అజయ్‌. అండర్ 14, అండర్ 17, అలాగే అండర్ 19 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మొదటి బహమతి సాధించాడు. అదే ఆత్మవిశ్వాసంతో ఇటీవల నిర్వహించిన అండర్ 21 తెలుగు కబడ్డీ లీగ్‌కు ఎంపికయ్యాడు. వచ్చే నెల నుంచి తెలంగాణ రాష్ట్ర కబడ్డీ ప్లేయర్‌గా శిక్షణ పొందనున్నట్లు చెబుతున్నాడు ఈ యువ క్రీడాకారుడు.

YUVA : షూటింగ్‌లో సత్తా చాటుతున్న అక్కాచెల్లెళ్లు - జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు కైవసం - Rifle Pistol Shooters Sucess Story

ప్రభుత్వం అండగా నిలవాలని : ఆర్థిక ఇబ్బందులతో కబడ్డీ పోటీలకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడేవాడు అజయ్‌. ఆ సమయంలో చదువు చెప్పిన మాస్టర్లు, శిక్షణ ఇచ్చిన కోచ్‌లు ప్రోత్సహించారని చెబుతున్నాడు. కళాశాల తర్వాత ఆర్థిక సమస్యలు రావడంతో ఇంటి దగ్గర ఉన్నవాళ్లు సాయం అందించారని అజయ్ అంటున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డామని సోదరి సుస్మిత చెబుతున్నారు. సోదరుడు అజయ్‌ కబడ్డీ అంటే మక్కువ ఉండటంతో ఆ దిశగా ప్రోత్సహించామని అంటోంది. ప్రభుత్వం సాయం అందిస్తే ఇంకా బాగా ఆడతాడని నమ్మకంగా చేస్తోంది.

"నా చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అక్కవాళ్లు నన్ను పెంచారు. నేను ఏడో తరగతి ఉన్నప్పటి నుంచి కబడ్డీ ఆడటం మొదలు పెట్టాను. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్రా, జాతీయ స్థాయిల్లో కబడ్డీ ఆడాను. ఎక్కడ ఆడినా నేను గెలిచాను. నేను చాలా సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చాలా మంది నాకు సహాయం చేశారు. పార్ట్​టైం జాబ్​ చేసుకుంటూ కబడ్డీ ప్రాక్టీస్ చేస్తున్నాను. తెలుగు కబడ్డీ లీగ్​కు ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం సహాయం చేస్తే నేను ఇంకా ఆడగలను. ప్రో కబడ్డీకి అడాలని, దేశం తరఫున ఆడాలని నా లక్ష్యం." - గొలనుకొండ అజయ్, క్రీడాకారుడు

అజయ్ చిన్నప్పటి నుంచి చదువు ఆటలు రెండిట్లో ముందు ఉండేవారని ప్రిన్సిపల్‌ శ్రీకాంత్ అంటున్నాడు. క్రీడల్లో రాణిస్తున్న అజయ్‌కు ప్రభుత్వం సాయం అందించాలని చిన్ననాటి స్నేహితులు కోరుతున్నారు. లక్ష్యం కోసం పట్టుదలతో ప్రయత్నిస్తే అవరోధాలు అడ్డుకావని నిరూపించాడు అజయ్‌. ప్రతిభ నైపుణ్యాలతో ఉత్తమ రైడర్, డిఫెండర్ పురస్కారాలు అందుకున్నాడు. ఇదే పట్టుదలతో భవిష్యత్‌లో ప్రో కబడ్డీ, ఇండియా జట్టుకు ఆడతానని ధీమాగా చెబుతున్నాడీ క్రీడాకారుడు.

YUVA : వినూత్నంగా భూగర్భశాస్త్రంపై పరిశోధన - ఆరేళ్ల సాధనకు పీహెచ్​డీలో పట్టా - krishna teja research on volcano

YUVA : పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సందీప్‌ - 25వేలకు పైగా పలురకాల విత్తనాల సేకరణ - sandeep establish green environment

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.