ETV Bharat / state

సాధ్యమైనంత త్వరగా రెండో విడత రుణమాఫీ చేస్తాం : మంత్రి తుమ్మల - Minister Tummala on 2ndPhase Waiver - MINISTER TUMMALA ON 2NDPHASE WAIVER

Second Phase of Crop Loan Waiver : రెండో విడత పంట రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు కాంగ్రెస్​ సర్కార్​ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో లక్ష రూపాయలు లోపు రుణాలకు సంబంధించి వరకు 11.50 లక్షల కుటుంబాలకు రూ.6098.94 కోట్లు విడుదల చేశామని తెలిపారు.

TG Crop Loan Waiver
Minister Tummala on 2nd Phase Debt Waiver (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 22, 2024, 7:55 PM IST

Minister Tummala on 2nd Phase Crop Loan Waiver : రాష్ట్రంలో రెండో విడత పంట రుణమాఫీ సాధ్యమైనంత త్వరగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ 2024లో మొదటి విడతలో లక్ష రూపాయలు లోపు రుణాలకు సంబంధించి వరకు 11.50 లక్షల కుటుంబాలకు 6098.94 కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు.

ఈ మేరకు 10,84,050 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో అత్యధికంగా రూ.454.49 కోట్లు మాఫీ అయ్యాయని, జిల్లాలోని 78,463 కుటుంబాలకు చెందిన 83,124 మంది రైతులకు రూ.లక్షలోపు రుణం మాఫీ అయినట్లు తెలిపారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో అతి తక్కువగా 2,667 ఫ్యామిలీలకు చెందిన 2,781 మంది రైతులకు రూ.12.53 కోట్లు మాఫీ అయిందని తెలిపారు.

త్వరలో సాంకేతిక సమస్యలు పరిష్కరించి నిధులు జమ చేస్తాం : వీటిలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ) నుంచి అందిన సమాచారం మేరకు 11.32 లక్షల కుటుంబాలకు రూ.6014 కోట్లు ఇప్పటికే జమ కావడం జరిగిందని చెప్పారు. అలాగే, కొన్ని సాంకేతిక కారణాల రీత్యా 17,877 బ్యాంకు ఖాతాలకు చెందిన 84.94 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ కాలేదని అన్నారు. ఆర్‌బీఐ సూచించిన వివరాల ప్రకారం ఆ రైతుల ఖాతాల్లో పేర్కొన్న సాంకేతిక సమస్యలు సత్వరం సరిచేసి, ఆర్‌బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా ఖాతాలకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలో వాణిజ్య బ్యాంకులకు అనుసంధానం చేయబడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (సీడెడ్ సంఘాలు) సంబంధించి మిగిలిన 15,781 రుణ ఖాతాల పారదర్శక తనిఖీ ప్రక్రియ ఇవాళ్టితో పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఆయా బ్యాంకుల ఖాతాల తనిఖీ అధికారులు పూర్తి చేసిన వెంటనే ఆ బ్యాంకుల ఖాతాలకు కూడా మిగిలిన రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

ఎట్టకేలకు రైతన్నకు విముక్తి - నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా రుణమాఫీ - మల్కాజిగిరిలో కేవలం ఒక్కరికే - Crop Loan Waiver in Telangana

మీ 'వాట్సాప్‌'కు రుణమాఫీ మెసేజ్‌ వచ్చిందా? - క్లిక్ చేశారో ఖాతాలో డబ్బంతా కల్లాస్!! - TELANGANA LOAN WAIVER FRAUD LINKS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.