ETV Bharat / state

హెచ్‌టీ పత్తి విత్తనాలను నిషేధించిన ప్రభుత్వం - రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు - Awareness On Fake Cotton Seeds

author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 10:45 PM IST

Awareness On Fake Cotton Seeds : అధిక దిగుబడుల కోసం హైబ్రిడ్‌ వంగడాలవైపు పరుగులు తీసిన రైతులు చీడపీడల నుంచి రక్షణ కోసం జెనెటిక్‌ విత్తనాలవైపు అడుగులు వేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే జన్యుమార్పిడి విత్తనాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఏకరీతి చట్టాలు లేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. నకిలీ లేదా అనుమతి లేని విత్తనాలు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తుండటంతో రైతులకు విత్తనాలపట్ల వ్యవసాయశాఖతోపాటు పోలీసు అధికారులు అవగాన కల్పిస్తున్నారు.

Awareness On Fake Cotton Seeds
Awareness On Fake Cotton Seeds (ETV Bharat)
హెచ్‌టీ పత్తి విత్తనాలను నిషేధించిన ప్రభుత్వం - రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు (ETV Bharat)

Awareness On Fake Cotton Seeds : పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం ప్రాంతంలోని రైతులు రెండేళ్లుగా హెచ్​టి పత్తి విత్తనాలు వినియోగిస్తున్నట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి దళారుల ద్వారా విత్తనాలను సదరు కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ విత్తనాలు కలుపు నివారణకు వినియోగించే గ్లైకోసిల్‌ మందును కూడా తట్టుకుంటాయి. సాగు వ్యయం తగ్గుతుందని బీటీ విత్తనాలవైపు అడుగులు వేసిన రైతులు తాజాగా హెచ్​టి విత్తనాలవైపు దృష్టి సారించడమే ప్రమాదకరంగా మారింది. దీంతో అధికారులు వ్యవసాయంలో లోటుపాట్లను వివరించేందుకు యత్నిస్తున్నారు.

Officials Create Awareness On Seeds : ఇప్పటికే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని రహస్య ప్రాంతాలలో హెచ్​టి విత్తనాలు సిద్ధం చేసిన విత్తన తయారీ మాఫియా రైతులకు నేరుగా సరఫరా చేసేందుకు గ్రామాల్లోని అన్నదాతలనే ఏజెంట్లుగా పెట్టుకుంది. విత్తనాలను ఒక ఊరి నుంచి మరో ఊరికి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయాధికారులు వీటివల్ల జరిగే నష్టంపై అవగాహన కలిగిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే జన్యుమార్పిడి విత్తనాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఏకరీతి చట్టాలు లేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది.

అవగాహన కల్పిస్తున్న అధికారులు : ఒకసారి హెచ్​టి పత్తి విత్తనాలు పెట్టిన నేలలో రెండోసారి అవే విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది. పంటమార్పిడి సాధ్యపడదు. పంట మార్పిడి కోసం వేసుకునే విత్తులను భూమిలో మిగిలిపోయిన హెచ్​టి విత్తనాలలోని విషపూరితమైన బ్యాక్టీరియాలు మొలకెత్తకుండా చేస్తాయి. భూమిని గుల్లబరిచి, గడ్డితోపాటు ఎలాంటి మొక్కలు పెరగకుండా చేస్తుందని అధికారులు చెబుతున్నారు. పర్యావరణానికి హాని కలిగించే హెచ్​టి పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. బ్రాండెడ్‌ ప్యాకెట్లు కూడా చిరిగిపోతే వాటిపై కేసులు నమోదయ్యే అవకాశముంది. రైతులకు, పర్యావరణానికి నష్టం కలిగించే అన్నిరకాల విత్తనాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసుల స్పష్టంచేశారు.

"విత్తనాలు, ఎరువులు అమ్మేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించి విక్రయించాలని డీలర్లకు సూచించడం జరిగింది. విత్తనాలను అమ్మేసమయంలో రైతులకు తగు సూచనలు చేయాలని డీలర్లను ఆదేశించాం. తొలకరి వర్షం పడినప్పుడు విత్తునాటేలా కాకుండా కనీసం 70ఎంఎం వర్షపాతం నమోదైనప్పుడు మాత్రమే విత్తుకోవాలని సూచించడం జరిగింది. డీలర్లు తమ ఇళ్ల వద్ద అమ్మరాదు. విత్తనాలపై డీలర్లకు అవగాహన కల్పించాం" - మురళి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు

సీడ్స్‌ షాపులపై అధికారులు ఆకస్మిక దాడులు - నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు - FAKE SEEDS IN TELANGANA

విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే పీడీ చట్టం కింద కేసులు - సీఎస్ హెచ్చరిక - CS Review with Collectors

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.