ETV Bharat / state

YUVA : ఆవిష్కరణలతో ఆలోచింపజేసిన విద్యార్థులు - దేశ రక్షణకు అవసరమైన ఆవిష్కరణల రూపకల్పన - Innovations Day In Hyderabad - INNOVATIONS DAY IN HYDERABAD

Innovations Day In IIT Hyderabad : సాంకేతికంగా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నా కొన్ని అంశాలల్లో మాత్రం ఆశించిన స్థాయి ఫలితాలు అందుకోలేకపోయాం. అలాంటి వాటిని సైతం అధిగమించి సమస్యలకు పరిష్కార మార్గాలు వెతికారు ఆ ఔత్సాహికులు. రక్షణరంగం నుంచి పేదవాడి సొంతింటి కల నెరవేర్చే వరకు పలురంగాలపై చేసిన ఆవిష్కరణ ప్రయత్నాలు ఫలించాయి. ఇంతకి ఏంటా ఆ ఆవిష్కరణలు.? భవిష్యత్తులో వాటి ప్రయోజనాలు ఎలా ఉండనున్నాయి.? ఈ కథనలో తెలుసుకుందాం.

Innovation Day 24 Celebrations In Hyderabadat
Innovations Day In IIT Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 20, 2024, 4:43 PM IST

Updated : Jul 20, 2024, 6:56 PM IST

Innovation Day 24 Celebrations In Hyderabad : ఆలోచనలు పదును పెట్టి సమాజంలోని సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించడమే అసలైన ఇంజినీరింగ్‌ విద్య అంటున్నారు ఈ విద్యార్థులు. కళాశాలు ఇచ్చిన ప్రోత్సాహంతో సృజనాత్మకతను వెలికితీసి పరిశోధన, ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఆధునాతన సాంకేతికతను వినియోగించి ఔరా అనిపించేలా ఆవిష్కరణలు రూపొందించారు ఈ ఔత్సాహికులు

సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదారాబాద్‌లో ఇన్నోవేషన్‌ డే-24 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఔత్సాహిక ఆవిష్కర్తలు హాజరు అయ్యారు. వీళ్లు రూపొందించిన ఆవిష్కరణలను ప్రదర్శించారు. సరికొత్తగా నిర‌్వహించిన ఈ కార్యక్రమం ఆసాంతం ఆలోపించజేసేలా, ఆసక్తికరంగా సాగింది. ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు ఈ యువత.

తక్కువ ధరలో మన్నికైన ఇంటి నిర్మాణం : ఇన్నోవేషన్‌ డే-24 కార్యక్రమం చాలా ఆవిష్కరణలు మనల్ని ఆలోచింపజేశాయి. అందులో పీహెచ్‌డీ విద్యార్థులు రూపొందించిన తక్కువ బరువు ఉన్న కాంక్రిట్‌ పేదవాడికి ఉపయుక్తంగా ఉంటుంది.ఈ ఆవిష్కరణతో సొంతింటి కలను తక్కువ ఖర్చుతో మన్నికగా నిర్మించుకోవచ్చని ఐఐటీ హైదారాబాద్‌ పీహెచ్‌డీ స్కాలర్‌ వీరేంద్ర చెబుతున్నాడు. భారత సైన్యానికి తమ వంతు సాయం అందించాలన్న ధృడ సంకల్పంతో వినూత్నంగా ముందుకు వచ్చింది హైదరాబాద్‌కు చెందిన డిఫెన్స్‌ కంపెనీ. సరికొత్త టెక్నాలజీతో సరిహద్దుల్లో పహారా కాసే డ్రోన్స్‌ తయారు చేసింది. అండర్‌ గ్రౌండ్‌లో దాక్కుని ఉన్న ఉగ్రమూకలను మట్టు పెట్టడాని సిద్ధం చేశారు. అలాగే తీవ్రవాదుల ఆనవాళ్లు కనుగొనడానికి ప్రత్యేక గ్రౌండ్‌ రోబోట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ కంపెనీ.

దేశ రక్షణకు అవసరమైన ఆవిష్కరణలు : సాధారణంగా బులెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను చూశాం. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పడు కొంత మేరకు తట్టుకోగలిగిన జాకెట్లను చూశాం. కానీ ఇక్కడ మనం చూస్తున్న జాకెట్‌ ఏకంగా 200 నుంచి 1200 డిగ్రీ వేడిని కూడా తట్టుకోగలుగుతుంది. సముద్రం నడిబొడ్డున నేవీ సైన్యం పోరాడే సమయాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తే తట్టుకునే విధంగా తయారు చేశామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇప్పటికే త్రీడీ సాంకేతికతతో రకరకాల వస్తువులు తయారు చేస్తున్నారు చాలా కంపెనీలు. తమ సాంకేతికతతో వారి నుంచి వచ్చే పోటీని ఎదుర్కొని అన్ని వస్తువులను తక్కువ బరువుతో నాణ్యతగా తయారు చేస్తాం అంటుంది లేయర్స్‌ క్రాఫ్ట్‌ సంస్థ. పైగా మిగిలిన త్రీడీ ప్రింటర్ల కంటే 4 రెట్లు అధిక వేగంతో తమ ఆవిష్కరణ పని చేస్తుందని చెబుతున్నారు.

అంకురాలు నెలకొల్పే ఆలోచన : ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న శానిటైజర్లు, ఫ్లోర్‌ క్లీనర్స్‌ వంటివి ఒకసారి వినియోగిస్తే కొంత సమయం వరకే వాటి ప్రభావం ఉంటుంది. కానీ ఐఐటీ హైదరాబాద్‌ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు తయారు చేసిన ప్రొడక్ట్స్‌ని ఒక్కసారి వాడితే రోజు మెుత్తం పనిచేస్తాయని చెబుతున్నారు. మరికొంత మంది విద్యార్థులు మహిళల్లో సాధారణంగా వచ్చే మూత్ర సంబంధిత వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నారు.

ఈ పరిశోధనలో వాళ్లు సాధించిన విజయాలను ఇలా వివరిస్తున్నారు. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలనే తీసుకుని పట్టుదలతో ప్రయత్నాలు చేశారు ఈ విద్యార్థులు. సమస్యను ఆవిష్కరించి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. భవిష్యత్తులో ఈ ఆవిష్కరణలను మరింతగా అభివృద్ధి చేసి అంకురాల స్థాపనకు ఆలోచన చేస్తాం అని ధీమాగా చెబుతోన్నారు ఈ ఇంజినీరింగ్‌ విద్యార్థులు.

YUVA - ఉద్యోగం చేస్తూనే 4 ప్రభుత్వ కొలువులు సాధించిన యువతి - జేఎల్‌లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు - Woman Got Four Jobs at a Once

YUVA : ఏఐ, డేటా సైన్స్‌ అంశాలపై పట్టుసాధించిన యువతి - ఏడాదికి రూ.34 లక్షల ప్యాకేజీతో కొలువు - Young Woman Got Rs 34 Lakhs Package

Last Updated : Jul 20, 2024, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.