Mohan Babu Discharged From Hospital : నటుడు మంచు మోహన్‌బాబు ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్య సమస్యతో బాధపడుతూ కాంటినెంటల్ హాస్పిటల్లో మంగళవారం సాయంత్రం ఆయన చేరారు. మోహన్‌బాబుకు ఆసుపత్రి వైద్యులు రెండు రోజుల పాటు చికిత్సనందించారు. కాగా ఇవాళ చికిత్స అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆయనను డిశ్చార్జ్ చేశారు. తరువాత పెద్దకుమారుడు మంచు విష్ణుతో కలిసి ఆయన ఇంటికి వెళ్లారు.
మంచు మోహన్‌బాబు కుటుంబంలో వివాదం, ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. మోహన్‌బాబు, మనోజ్‌లు ఇప్పటికే ఒకరిపై ఒకరు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. బుధవారమే రాచకొండ సీపీ మంచు మనోజ్, విష్ణులను విచారించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని వారికి సూచించారు. మరోవైపు మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో మోహన్‌బాబుపై ఇప్పటికే పోలీస్ కేసు నమోదైంది.
హైకోర్టులో మోహన్‌బాబుకు ఊరట - అప్పటివరకు పోలీసుల ముందు హాజరుకు మినహాయింపు
మీడియా ప్రతినిధులపై దాడి - సీనియర్ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు