ETV Bharat / state

తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల విరాళాలు - ఎన్టీఆర్​ సహా ఎవరెవరు ఎంత ఇచ్చారంటే? - NTR Donate 1 Crore to Telugu States

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2024, 10:09 AM IST

Updated : Sep 3, 2024, 1:25 PM IST

Actor Jr NTR Donates One Crore to Telugu States : తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై సాయం అందించేందుకు టాలీవుడ్​ సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. జూ.ఎన్టీఆర్​, విశ్వక్​ సేన్​, సిద్ధు జొన్నలగడ్డ, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్​, ప్రముఖ నిర్మాత ఎస్​.రాధాకృష్ణ, నాగవంశీ సహా పలువురు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు.

Actor Jr NTR Donates One Crore to Telugu States
Actor Jr NTR Donates One Crore to Telugu States (ETV Bharat)

Film Celebrities Donation to Telugu States Affected by Floods : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్​, ఏపీలోని విజయవాడ, కృష్ణా జిల్లాల పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. వాగులు, వంకలు పొంగి ప్రధాన రహదారులు, కాలనీలను చెరువులుగా మార్చేశాయి. దీంతో ప్రజలు గత మూడు రోజులుగా వరద నీటిలోనే ఉంటూ, పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. అన్నీ కోల్పోయిన తమకు కట్టుబట్టలే మిగిలాయని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పలువురు దాతలు ముందుకొచ్చి తమవంతు సాయం చేస్తున్నారు. ఎవరికి తోచినంత వారు అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్​ సినీ పరిశ్రమ వరద బాధితులకు అండగా నిలిచింది. హీరో జూనియర్​ ఎన్టీఆర్ సహా పలువురు తమ వంతుగా వరద బాధితులకు సాయం అందించారు. జూనియర్​ ఎన్టీఆర్​ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ఇరు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం అందించారు. ఈ మేరకు 'ఎక్స్'​ వేదికగా పోస్టు చేశారు.

జూ.ఎన్టీఆర్​ రూ.1 కోటి విరాళం : తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం తనను కలచివేసిందని జూనియర్​ ఎన్టీఆర్​ ట్వీట్​ చేశారు. అతి త్వరగా తెలుగు ప్రజలు కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్లు జూ.ఎన్టీఆర్​ వెల్లడించారు.

"రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను. - ఎన్టీఆర్​ ట్వీట్

విశ్వక్​సేన్ రూ.10 లక్షలు, సిద్ధు రూ.30 లక్షలు : నటులు విశ్వక్​సేన్​, సిద్ధు జొన్నలగడ్డ సైతం ఇరురాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. విశ్వక్​సేన్ ఏపీ, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించగా, సిద్ధు జొన్నలగడ్డ చెరో రూ.15 లక్షల చొప్పున రూ.30 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు వెల్లడించారు.

త్రివిక్రమ్​ రూ.50 లక్షలు : వీరితో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్​, నిర్మాత ఎస్​.రాధాకృష్ణ, నాగవంశీలు కలిసి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాలకు చెరో రూ.25 లక్షల చొప్పున సీఎం సహాయ నిధికి జమ చేశారు. ఇక ఇటీవలే కల్కితో భారీ విజయాన్ని అందుకున్న వైజయంతీ మూవీస్​ అధినేత అశ్వనీదత్​ ఆంధ్రప్రదేశ్​కు రూ.25 లక్షల సాయం ప్రకటించారు.

కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతోన్న వరద - వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల - Flood Flow Of Krishna Project

ప్రకాశం బ్యారేజీ నుంచి వరద ప్రవాహం - గేట్లకు అడ్డుపడ్డ 4 బోట్లు - PRAKASHAM BARRAGE GATES OPENED

Last Updated : Sep 3, 2024, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.