ETV Bharat / state

'కేసు విషయంలో ఎన్నో మాట్లాడాలని ఉన్నా - కోర్టు ఆదేశాల మేరకు మాట్లాడలేకపోతున్నా' - ALLU ARJUN ABOUT STAMPEDE

సంధ్య థియేటర్​లో అనుకోకుండా జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదన్న అల్లు అర్జున్‌ - త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానని వెల్లడి

ALLU ARJUN ON THEATRE TRAGEDY
Allu Arjun about Stampede Incident (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2024, 2:19 PM IST

Allu Arjun about Stampede Incident : తనపై నమోదైన కేసుకు సంబంధించి అనేక విషయాలు మాట్లాడాలని ఉన్నా, కోర్టు ఆదేశాల మేరకు మాట్లాడలేకపోతున్నట్లు అల్లు అర్జున్ స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ వద్ద విషాదకర సంఘటన జరగడం పట్ల మరోసారి బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఆయన, త్వరలోనే ఆ కుటుంబాన్ని కలుస్తానని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి తనకు మద్దతు ఇస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్, జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

తనపై చూపించిన ప్రేమ, అభిమానానికి అభిమానులకు, దేశవ్యాప్తంగా మద్దతిచ్చిన మీడియాకు కృతజ్ఞతలు చెబుతున్నానంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు. సంధ్య థియేటర్‌లో జరిగింది అనుకోని ఘటన అని, అందులో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. గత 20 ఏళ్లుగా సంధ్య థియేటర్‌కు వెళ్తున్నానని, ఇప్పటి వరకు 30 సార్లు సంధ్య థియేటర్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. మరోవైపు జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్​కు ప్రముఖుల నుంచి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. నందమూరి బాలకృష్ణ స్వయంగా అల్లు అరవింద్​కు ఫోన్ చేసి అల్లు అర్జున్​తో మాట్లాడి పరామర్శించారు. ఈ మేరకు కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అల్లు అర్జున్‌ను పరామర్శించిన ప్రముఖులు : 'పుష్ప' దర్శక నిర్మాతలతో పాటు హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రానా, నాగచైతన్య, సుధీర్ బాబు, దర్శకులు రాఘవేంద్రరావు, కొరటాల శివ, వంశి పైడిపల్లి, బి.గోపాల్​, ఆర్. నారాయణమూర్తి, నిర్మాతలు సురేశ్​ బాబు, దిల్ రాజు, బీవీఎన్​ఏస్ ప్రసాద్, సంగీత దర్శకుడు తమన్ సహా పలువురు సన్నిహితులు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్​లు అల్లు అర్జున్​ను కలిసి మద్దతు ప్రకటించారు. కాసేపు అల్లు అరవింద్, అల్లు అర్జున్​లతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

చిరంజీవి సతీమణి భావోద్వేగం : ముఖ్యంగా చిరంజీవి సతీమణి సురేఖ అల్లుఅర్జున్ నివాసానికి చేరుకోగానే సోదరుడు అల్లు అరవింద్ దగ్గరుండి బన్నీ వద్దకు తీసుకెళ్లారు. తనను హత్తుకొని సురేఖ ఒకింత భావోద్వేగానికి గురికావడంతో అల్లు అర్జున్ కళ్లు చెమ్మగిల్లాయి. ఇలా సినీ, రాజకీయ ప్రముఖులు, సన్నిహితులతో అల్లు అర్జున్ నివాసం వద్ద సందడి నెలకొంది. మరోవైపు అభిమానులు ఎవరూ అర్జున్ నివాసానికి రాకుండా పోలీసులు మూడు వైపుల బారికెడ్లు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు నిర్వహించారు.

నేను చట్టానికి కట్టుబడి ఉంటా - నా గురించి ఎవరూ ఆందోళన చెందొద్దు : అల్లు అర్జున్‌

'ఇది సరైన నిర్ణయం కాదు' - టాలీవుడ్​ నుంచి బాలీవుడ్​ దాకా సినీ ప్రముఖుల స్పందన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.