ETV Bharat / state

గొర్రెల స్కామ్ కేసులో పురోగతి - అసలు దొంగలను గుర్తించిన ఏసీబీ - TELANGANA SHEEP DISTRIBUTION SCAM

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 26, 2024, 6:44 AM IST

Updated : Jun 26, 2024, 7:06 AM IST

Sheep Distribution Scam Case in Telangana : గొర్రెల పంపణీ పథకం కుంభకోణంలో విస్తోపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కళ్యాణ్‌ కుమార్‌, దళారుల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు లంచం సొమ్మును బదిలీ చేయించుకునట్లు ఏసీబీ గుర్తించింది. గొర్రెలను సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించిన రామరాజు నుంచి కళ్యాణ్, అనే వ్యక్తులు అనధికారికంగా నగదు సమకూరినట్లు అధికారులు గుర్తించారు.

Sheep Distribution Scam Case in telangana
Sheep Distribution Scam Case in telangana (ETV Bharat)

Telangana Sheep Distribution Scam Case Update : సంచలనం సృష్టించిన గొర్రెల పంపణీ పథకం కుంభకోణంలో అవినీతి నిరోధక సంస్థ దర్యాప్తులో విస్తోపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఓఎస్డీగా వ్యవహరించిన కళ్యాణ్ కుమార్‌.. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించి మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో పలు అంశాలు బహిర్గతమయ్యాయి.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కళ్యాణ్‌ కుమార్‌, దళారుల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు లంచం సొమ్మును బదిలీ చేయించుకునట్లు ఏసీబీ గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా షీప్ రియరింగ్ డిస్ట్రిబ్యూషన్ పథకాన్ని పర్యవేక్షించిన కళ్యాణ్ కుమార్‌తోపాటు మరికొందరు ఒక్కో యూనిటు 2వేల చొప్పున అనధికారిక లబ్ధి పొందినట్లు దర్యాప్తు క్రమంలో తేలింది. ఆ సొమ్మును దళారుల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్న తీరును దర్యాప్తు సంస్థ బహిర్గతం చేసింది. నగదు బదిలీ అయిన రోజు జరిగిన ఫోన్ సంభాషణలను విశ్లేషించడం ద్వారా కీలక ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించారు.

Sheep Distribution Scam Accused : గొర్రెల పథకంలో రామరాజు అనే వ్యక్తి దాదాపు 380 యూనిట్లను సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే రామరాజు వద్ద పని చేసిన వినయ్ బ్యాంకు ఖాతాను ఏసీబీ అధికారులు పరిశీలించారు. గతేడాది నవంబర్ 4న మధ్యాహ్నం ఒంటి గంటా 47 నిమిషాలకు వినయ్‌కు రామరాజు ఫోన్ చేసినట్లు తేలింది. రెండు ఫోన్‌ నంబర్లను సమకూర్చి వాటికి నగదు బదిలీ చేయాలని వినయ్‌కు సూచించినట్లు గుర్తించారు.

ఈ క్రమంలోనే వినయ్ బ్యాంక్‌ ఖాతా ద్వారా పశుసంవర్ధక శాఖలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ఫోన్ నెంబర్ ఆన్‌లైన్‌లో 50 వేలు బదిలీ చేసినట్లు గుర్తించారు. అలాగే కళ్యాణ్‌ సన్నిహితుడి భార్య ఖాతాకు 2 లక్షలు బదిలీ చేసినట్లు వెల్లడైంది. నగదు బదిలీ జరిగిన రోజు సదరు సన్నిహితుడు ఉదయం 10:59కి కళ్యాణ్ కుమార్‌కు ఫోన్‌ చేసినట్లు తేలింది. కళ్యాణ్ రెగ్యులర్ మహిళా ఉద్యోగితో ఫోన్‌లో మాట్లాడినట్లు తేలింది.

'రాష్ట్రంలో ఉన్న గొర్రెలు, మేకలు ఎన్ని? - వివరాలు సేకరించి ఇవ్వండి' - Sheep Distribution Scam Update

మరోవైపు వినయ్, రామరాజు నుంచి మహిళా ఉద్యోగికి ఎలాంటి ఫోన్ కాల్స్ లేవని తేలింది. గొర్రెలను సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించిన రామరాజు నుంచి కళ్యాణ్ అనధికారికంగా నగదు సమకూరినట్లు అధికారులు గుర్తించారు. రామరాజు తన ఉద్యోగి వినయ్ ద్వారా కళ్యాణ్‌కు సన్నిహితంగా ఉన్న మహిళా ఉద్యోగి ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. అలాగే అదే రోజు మహిళా ఉద్యోగికి కళ్యాణ్ కుమార్ రెండుసార్లు ఫోన్ చేయగా.. ఆమె మరో రెండు సార్లు అతడికి ఫోన్ చేసినట్లు గుర్తించారు. అలాగే కళ్యాణ్ కూమార్ సీఆర్జీఏ విశ్లేషించగా మహిళా ఉద్యోగి నుంచి 1894 ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఉన్నట్లు.. కళ్యాణ్ నుంచి మహిళా ఉద్యోగికి 1311 ఔట్‌ గోయింగ్ కాల్స్ ఉన్నట్లు వెల్లడైంది.

రామరాజు డ్రైవర్ నుంచి 161 సీఆర్పీసీ కింద ఏసీబీ వాంగ్మూలం సేకరించింది. ఈ క్రమంలో రామరాజు తరచూ కళ్యాణ్ కుమార్‌ను కలిసేవాడని తేలింది. అలాంటి సమయాల్లో రామరాజు నగదు రూపంలో కళ్యాణ్‌కు డబ్బు ముట్టజెప్పేవాడని తేలింది. రామరాజుతోపాటు ఇదే కేసులో ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ లాంటి మరికొందరు దళారులు బృందంగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల యూనిట్లను సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇలాంటి వారితోనే కళ్యాణ్‌ దందా నడిపించినట్లు అధికారులు గుర్తించారు. ఈ బృందం క్షేత్ర, జిల్లా, రాష్ట్రస్థాయిలో అధికారులతోపాటు కీలక ప్రజాప్రతినిధులకు స్థాయిలవారీగా లంచాలు ముట్టజెప్పినట్లు వెల్లడైంది. ఒక్కో యూనిట్కు 2 వేల రూపాయల చొప్పున కళ్యాణ్‌ సహా మరికొందరు లబద్ధి పొందినట్లు తేలింది.

'గొర్రెల పంపిణీలో అక్రమాలపై స్పందించిన ఈడీ - పేపర్ లీక్​లపై ఎందుకు స్పందించడం లేదు' - BRS leader Vinod Kumar accused BJP

Last Updated : Jun 26, 2024, 7:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.