ETV Bharat / state

జోగి రమేష్ కుమారుడిపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన ఏసీబీ - FIR on Jogi Rajeev

ACB Registered FIR Against Jogi Ramesh Son Rajeev: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌ కుమారుడు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

ACB Registered FIR Against Jogi Ramesh Son Rajeev
ACB Registered FIR Against Jogi Ramesh Son Rajeev (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 13, 2024, 2:07 PM IST

Updated : Aug 13, 2024, 2:28 PM IST

ACB Registered FIR Against Jogi Ramesh Son Rajeev : ఇవాళ ఉదయం 5 గంటల నుంచి మాజీ మంత్రి జోగి రమేశ్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. 15 మంది ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని సోదాలు చేపట్టారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై తనిఖీలు చేశారు. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించారు. జోగి ఇంట్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఏ1గా జోగి రమేశ్‌ కుమారుడు : జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఏ1గా జోగి రాజీవ్, ఏ2గా జోగి వెంకటేశ్వరావులను ఎఫ్‌ఐఆర్ చేర్చారు. ఎఫ్‌ఐఆర్‌లో మండల సర్వేయర్‌ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య పేర్లు అలాగే నున్న సబ్‌ రిజిస్ట్రార్‌ వి.నాగేశ్వరరావును చేర్చారు.సెక్షన్ 120బీ, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 సెక్షన్ల కింద, అలాగే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు చేశారు.

రికార్డులను సరిగా పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ : అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆగస్టు 8న కేసు నమోదు చేశారు. అవ్వ వెంకట శేషు నారాయణ ఫిర్యాదుతో విజయవాడ వెస్ట్ ఏసీపీ విచారించారు. విచారణ నివేదికను గతంలోనే డీజీపీకి ఎన్టీఆర్ జిల్లా సీపీ సమర్పించారు. మండల, గ్రామ సర్వేయర్లు తప్పుడు సర్వే చేశారని విజయవాడ పోలీసుల నివేదించారు. విజయవాడ పోలీసుల నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. సర్వే జరపకుండా సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లు, సరిహద్దుల్లో ఉన్నవారికి నోటీసులు ఇవ్వకుండా రిపోర్ట్ ఇచ్చినట్లు ఏసీబీ నిర్ధారించింది. 87 సర్వే నెంబర్ సీఐడీ అటాచ్‌లో ఉందని ఏసీబీ గుర్తించింది. నున్న సబ్ రిజిస్ట్రార్‌ రికార్డులను సరిగా పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేశారని ఏసీబీ తెలిపినట్లు సమాచారం.

అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏసీబీ కొరడా- మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్! - ACB Raids in Jogi Ramesh House

Last Updated : Aug 13, 2024, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.