ACB Officers RAID on Eluru Three Town Police Station : ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌పై అనిశా అధికారులు అర్థరాత్రి ఆకస్మాత్తుగా దాడులు చేపట్టారు. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఓ 420 కేసుపై 41ఏ సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చేందుకు ఒక రైల్వే ఉద్యోగిని పోలీసు అధికారులు రూ.2 లక్షలు డిమాండ్ చేయగా, గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ వి. సుబ్బరాజు ఆధ్వర్యంలో వల పన్నిన అధికారులు కానిస్టేబుల్ డబ్బులు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు వెల్లడించారు.
కడప ఎమ్మార్వో ఇంట్లో ఏసీబీ సోదాలు - పరిమితిని మించిన ఆస్తులే కారణమా! - ACB RAIDS ON MRO HOUSE
ఏలూరు శివారు వట్లూరు ప్రాంతానికి చెందిన రైల్వే ఉద్యోగి పెందుర్తి విక్టర్‌బాబు ఒక 420 కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతనికి 41ఏ సీఆర్‌పీసీ నోటీసు ఇవ్వాల్సి ఉండగా, అతన్ని అరెస్ట్ చేసేందుకు ఏలూరు త్రీటౌన్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విక్టర్‌బాబు హైకోర్టుకు వెళ్లి తనను అరెస్ట్ చేయకుండా 41ఏ సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చేందుకు ఏలూరు త్రీటౌన్ పోలీసులు విక్టర్‌బాబును రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. విక్టర్‌బాబు అంత సొమ్ము ఇచ్చుకోలేనని రూ.50 వేలు ఇస్తానని పోలీసుల అధికారులతో ఒప్పందం చేసుకున్నాడు. అయినా అతని ఇంటికి పలుమార్లు పోలీసు సిబ్బంది వెళ్లి వేధింపులకు గురి చేయడంతో విధిలేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై అనిశా దాడులు- రూ. 2.50 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి
బాధితుడు విక్టర్‌బాబు ఏలూరు త్రిటౌన్ స్టేషన్‌కు వచ్చి కానిస్టేబుల్ ఇస్సాక్‌ను సంప్రదించగా, అతను స్టేషన్ ఉన్నతాధికారులను సంప్రదించి వారి వద్ద నుంచి రూ.50 వేలు సొమ్ము తీసుకుని ఫ్యాంటు వెనుక జేబులో పెట్టుకున్నాడు. అప్పటికే వల పన్ని కానిస్టేబుల్ ఇస్సాక్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అతని జేబులోని నగదును కెమికల్ టెస్ట్ చేయగా, చేతులకు ప్యాంటు వెనుక జేబుకు కెమికల్ ముద్రలు లభించడంతో కానిస్టేబుల్ ఇస్సాక్‌ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఈ అవినీతి ఘటనపై ఇంకా ఎవరైనా అధికారులు ఉన్నారా అనే దానిపై విచారణ చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు ఎన్ భాస్కరరావు, బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
భూమి పట్టాకు రూ.1.50 లక్షలు డిమాండ్- ఏసీబీ వలలో సూపరింటెండెంట్