ETV Bharat / state

YUVA : చిచ్చరపిడుగులా రగ్బీలో సత్తా చాటుతున్న తెలంగాణ అమ్మాయి - దేశానికి ప్రాతినిథ్యమే లక్ష్యంగా అడుగులు - Abhinaya Sri Rugby Player

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 5:36 PM IST

Updated : Aug 30, 2024, 6:16 PM IST

Abhinaya Sri Rugby player : చిన్నతనం నుంచే ఆ యువతికి ఆటలపై ఎనలేని ఇష్టం. పేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్నప్పటికీ తన లక్ష్యం మాత్రం వదల్లేదు. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టుకోకుండా ప్రతీ అవకాశాన్నీ అందిపుచ్చుకుంటూ కఠోర సాధన చేస్తూ, పట్టణ యువతకే పరిమితమైన రగ్బీ ఆటలో తనదైన ముద్ర వేస్తోంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎక్కడ బరిలోకి దిగినా మైదానంలో మెరుపువేగంతో రగ్బీ ఆటలో సత్తా చాటుతోంది. అనేక క్రీడా పోటీల్లో శభాష్ అనిపించుకుని ప్రశంసలు అందుకున్న ఖమ్మం కు చెందిన యువ క్రీడాకారిణి అభినయశ్రీ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది.

Abhinaya Sri Special Talent in Rugby
Abhinaya Sri Rugby player (ETV Bharat)

Abhinaya Sri Special Talent in Rugby : ఖమ్మం పట్టణంలోని రోటరీనగర్‌కు చెందిన చెల్లగొండ అభినయశ్రీకి చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. 10 వ తరగతి వరకు రోటరీనగర్‌ జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది.పాఠశాల స్థాయిలో క్రీడల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్‌ ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురంలోని కస్తూర్బా విద్యాలయంలో చేరింది. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

రగ్బీపై మక్కువ : చిన్నప్పటి నుంచే అభినయశ్రీ రగ్బీ ఆటపై ప్రత్యేక దృష్టి సారించింది. రగ్బీ పోటీలను చూస్తూ ఆ ఆటపై ప్రత్యేక దృష్టి పెట్టి సాధన చేసింది. ఆట విశిష్టత, ఆటలో మెలకువలపై ప్రత్యేకంగా శోధన చేసి మరీ ప్రాక్జీసు చేస్తుండేది. రగ్బీ ఆటపై అభినయశ్రీకి ఉన్న ఇష్టాన్ని గుర్తించిన ప్రత్యేక అధికారిణి ఇందిర, పీఈటీ నిర్మల ప్రోత్సాహంతో ఆటలో రాటుదేలుతూ వచ్చింది. జిల్లాస్థాయిలో ఎంపికల్లో మైదానంలో చిచ్చరపిడుగులా రగ్బీలో సత్తా చాటింది. తర్వాత రాష్ట్రస్థాయిలో పలు పోటీల్లో పాల్గొని ఔరా అనిపిందింది.

రాష్ట్రస్థాయిలో సత్తా : ఇటీవల హైదరాబాద్‌లోని జింఖానా ఫుట్‌బాల్‌ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఏటికేడు రగ్బీ ఆటలో ప్రావీణ్యం సాధించడమే కాకుండా అద్భుతమైన ఆటతీరుతో జాతీయ స్థాయి టోర్నీల్లోనూ తనదైన ముద్రవేసింది. పలు రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీలకు రాష్ట్రం తరపున ఆడి సత్తా చాటింది. ఇటీవల పూణేలోని బల్లెవాడిలో జూలై నెలలో జరిగిన జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనతో నిర్వాహకుల మనసు గెలిచింది.

దేశం తరఫున ఆడటమే లక్ష్యంగా : జాతీయ స్థాయిలో భారత జట్టు తరపున ఆడి అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే తన లక్ష్యమంటోందీ అభినయశ్రీ. ఇక రగ్భీ ఆట ఒక్కటే కాకుండా ఆరో తరగతి నుంచి కరాటే నేర్చుకుని జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని తన పంచ్​ల రుచి చూపిస్తోందీ అభినయశ్రీ. గోవాలో జరిగిన నేషనల్‌ యూత్‌ స్పోర్ట్స్‌ ఎడ్యూకేషన్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని బంగారు పతకం, బ్లాక్‌బెల్ట్‌ సాధించింది.

కరాటేలోనూ అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే అభినయశ్రీ తన లక్ష్యమంటోంది. ఇందుకు అనుగుణంగానే కళాశాల పీఈటీ, అధ్యాపకులు ఆమెకు తర్ఫీదు ఇస్తున్నారు. తమ విద్యాసంస్థలో చదివే విద్యార్థినీ క్రీడల్లో రాణించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టినా తన స్థితిని చూసి బాధపడకుండా, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందించే ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని తనకు ఇష్టమైన క్రీడల్లో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది ఈ యువతి. ప్రభుత్వ పెద్దలు ఇటువంటి క్రీడాకారులను గుర్తించి మంచి శిక్షణ ఇస్తే దేశానికి ఎంతోగానే సేవలు అందించే అవకాశం ఉంది.

"నాకు రగ్బీ ఆట అంటే ఎంతో ఇష్టం. జాతీయ స్థాయిలో భారత జట్టు తరపున ఆడి అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే నా లక్ష్యం. నన్ను మా ఉపాధ్యాయురాలు నిర్మల మేడమ్, ఇందిరా మేడమ్ చాలా ప్రోత్సహిస్తున్నారు. రగ్బీ ఆటలో శిక్షణ ఇస్తున్నారు". - అభినయశ్రీ, రగ్బీ క్రీడాకారిణి, ఖమ్మం

YUVA - ఆకట్టుకుంటున్న యువతి పెయింటింగ్స్ - సందేశాలిచ్చేలా చిత్రకారిణి చిత్రాలు - Yuva on Young Artist

ఇంజినీరింగ్ డ్రాపౌట్- 19 ఏళ్లకే సొంత కంపెనీ ప్రారంభం: యువకుడి సక్సెస్ స్టోరీ - FREEDOM WITH AI COMPANY

Last Updated : Aug 30, 2024, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.