ETV Bharat / state

ఆమెకు డ్రగ్స్​ అలవాటు ఉంది - అందుకే వదిలేశా : రాజ్​తరుణ్ - Police Case on Hero Raj Tharun - POLICE CASE ON HERO RAJ THARUN

A Case Registered Against Hero Raj Tharun : సినీనటుడు రాజ్​తరుణ్​పై నార్సింగి పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై హీరో రాజ్​తరుణ్​ స్పందించారు. ఆయన ఏమన్నారంటే?

Hero Raj Tharun
A Case Registered Against Hero Raj Tharun (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 2:48 PM IST

Updated : Jul 5, 2024, 5:11 PM IST

Police Case on Hero Raj Tharun : సినీ నటుడు రాజ్​తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్​తరుణ్, తాను 2012 నుంచి రిలేషన్​లో ఉన్నామని, ఇటీవల అతడు మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్​తో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొంది. 'తిరగబడరా సామి' అనే సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్ కొనసాగిస్తున్నట్లు తేలిందన్నారు. ఇదే విషయమై రాజ్​తరుణ్​ను నిలదీస్తే, తనను దుర్భాషలాడాడని ఫిర్యాదులో పేర్కొంది.

మాల్వి తండ్రి, సోదరుడు రాజ్​తరుణ్​ను వదిలేయాలని తనను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. సంబంధం లేని కేసులో తనను ఇరికించారని, దాంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపింది. కాగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదును నార్సింగి పోలీసులు స్వీకరించారు. ఈ విషయంపై ఇన్​స్పెక్టర్ హరికృష్ట రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజ్​తరుణ్‌ తనను మోసం చేసి, మరో యువతితో సహజీవనం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదు చేశారన్నారు. తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై ఆధారాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉన్నట్లు వెల్లడించారు.

రాజ్​తరుణ్​ స్పందన ఇదే : లావణ్య చేసిన ఆరోపణలపై హీరో రాజ్​తరుణ్​ స్పందించారు. లావణ్య, తాను గతంలో సహజీవనం చేశామని, రెండున్నరేళ్లు కలిసి జీవించామని తెలిపారు. లావణ్యను తను పెళ్లి చేసుకోలేదన్న రాజ్​తరుణ్​, 2017 నుంచి తనకు లావణ్యతో సంబంధం లేదన్నారు. లావణ్యకు డ్రగ్స్‌ అలవాటు ఉందని ఆరోపించారు. ఇప్పుడు లావణ్య మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోందని, మస్తాన్‌ మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిందని తెలిపారు.

కొన్నాళ్లుగా లావణ్య తనను బెదిరిస్తోందని రాజ్‌తరుణ్‌ వెల్లడించారు. ఈ విషయంలో తానే లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నానని, తన పేరు పాడవుతుందనే ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం నార్సింగి పోలీసులకు తనపై కంప్లైంట్​ ఇచ్చిన నేపథ్యంలో తానూ లావణ్యపై ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రెస్​మీట్​ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానని రాజ్​తరుణ్​ స్పష్టం చేశారు.

నేను, లావణ్య గతంలో సహజీవనం చేశాం. 2017 నుంచి నాకు లావణ్యతో సంబంధం లేదు. ఆమెకు డ్రగ్స్‌ అలవాటు ఉంది. కొన్నాళ్లుగా లావణ్య నన్ను బెదిరిస్తోంది. నేనే లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నా. నా పేరు పాడవుతుందనే ఫిర్యాదు చేయలేదు. లావణ్యపై నేను ఫిర్యాదు చేస్తా. ప్రెస్‌మీట్‌ పెడతా. - సినీనటుడు రాజ్‌తరుణ్‌

గోవా నుంచి తెచ్చి హైదరాబాద్​లో డ్రగ్స్ విక్రయం - రాజ్​తరుణ్ ప్రేయసి అరెస్ట్

Last Updated : Jul 5, 2024, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.