ETV Bharat / state

తస్మాత్ జాగ్రత్త - ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు కిడ్నాప్ - సీసీ కెమెరాలో రికార్డ‌యిన దృశ్యాలు - Boy Kidnaped From Hospital - BOY KIDNAPED FROM HOSPITAL

Three Year Old Boy Kidnapped : తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడి అదృశ్యం కలకలం రేపిది. ఆసుపత్రి ఆవరణలో తండ్రితో కలిసి పడుకున్న కుమారుడిని అపహరించారు. రాత్రి 3 గంటల సమయంలో దుండగులు ఎత్తుకెళ్లినట్లుగా సీసీ కెమెరాలో నమోదైంది. బాలుడి కోసం ఆసుపత్రి పరిసరాలు వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Three Year Old Boy Kidnapped
Three Year Old Boy Kidnapped (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 20, 2024, 4:27 PM IST

Boy Kidnaped From Hospital By Two Thieves in Nizamabad : ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వస్తే, బాలుడిని అపహరించిన ఘటన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఆసుపత్రిలో తండ్రి వద్ద నిద్రిస్తున్న బాలుడిని ఇద్దరు వ్యక్తులు అపహరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. బాలుడి కిడ్నాప్​పై తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి జాడ కనిపెట్టాలంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడి అపహరణ సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాలుడిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నగర శివారులోని మాణిక్ బండార్​కు చెందిన నాగుల సాయినాథ్, ఛాయా దంపతుల కుమారుడు అరుణ్​ (3 ). ఛాయా ప్రసవం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. భార్య, కుమారుడితో కలిసి వచ్చిన సాయినాథ్ ఆసుపత్రి ఆవరణంలో నిద్రించాడు. రాత్రి మూడు గంటల నుంచి బాలుడు కనిపించక పోవడంతో సాయినాథ్ పోలీసులను ఆశ్రయించాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమ కుమారుణ్ణి అప్పగించాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

నర్సు వేషంలో వచ్చిన మహిళా కిడ్నాపర్​- అర్థరాత్రి శిశువు అపహరణ - CHILD KIDNAPPING

'ఆసుపత్రి వరండాలో అందరం నిద్రిస్తున్నాం. ఆ సమయంలో ఇద్దరు యువకులు ఇక్కడికి వచ్చారు. కొంత సేపటివరకూ అక్కడే పడుకున్నట్లు నటించారు. ఆ తరువాత అదును చూసి నా వద్ద నిద్రిస్తున్న మా అబ్బాయిని అక్కడి నుంచి అపహరించి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు అయ్యాయి. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. సీసీ టీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా నింధితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మాకు ఓ వ్యక్తిపై అనుమానం ఉంది. అతని ఇంటికి వెళ్లి అక్కడ బాలుడి ఆచూకీ కోసం వెతుకుతాం.' -నాగుల సాయినాథ్, బాలుడి తండ్రి

కిడ్నాప్‌ చేసి, కుక్కలతో బెదిరించి- ఎమ్మార్పీఎస్ నేత కిడ్నాప్​ కేసులో విస్మయకర విషయాలు వెలుగులోకి - MRPS Leader Kidnap

"కడుపున మోయకున్నా కంటికిరెప్పలా చూసుకుంటున్నాం - మా బిడ్డల్ని మాకు దూరం చేయొద్దు" - FOSTER PARENTS CRIES FOR THEIR KIDS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.