Rare Liver Surgery in Nakshatra Hospital : హైదరాబాద్ నక్షత్ర హాస్పిటల్లో కాలేయానికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి రోగి ప్రాణాలు కాపాడింది. మహబూబ్ నగర్‌కు చెందిన 45 సంవత్సరాల బాల నారాయణ అనే వ్యక్తిని కాలేయానికి సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. అనేక ఆసుపత్రులు తిరిగినా ఎక్కడా వ్యాధి నయం కాకపోవడంతో ఎల్బీనగర్లోని నక్షత్ర హాస్పిటల్‌ను సంప్రదించాడు. హాస్పిటల్ వైద్యులు అధునాతనమైన రోగ నిర్ధారణ పద్ధతులైన బిలియో ఫ్లూరల్ క్యూటేనియస్ పిస్టుల్లా, ఎంపైమా డయగ్నోసిస్ చేసి రోగి ప్రాణాలు కాపాడారు.
ఇలాంటి సర్జరీ చేయడం చాలా క్లిష్టతరమని కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు నక్షత్ర హాస్పిటల్లో ఉన్నందువల్ల క్రిటికల్ కేర్ బృందం ఎమర్జెన్సీ డాక్టర్ల బృందం సహకారంతో చికిత్స విజయవంతం అయ్యిందని పల్మనాలజీ సర్జన్ డాక్టర్ అరుణ్ కానాల తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ సర్జరీకి సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని, నక్షత్ర హాస్పిటల్లో కేవలం రెండున్నర లక్షలకే పూర్తి చేయగలిగామని నక్షత్ర హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. నక్షత్ర హాస్పిటల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందించగలుగుతున్నామన్నారు.