ETV Bharat / state

భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో బాలికతో వివాహం - ట్విస్ట్‌ తేలిస్తే అదుర్స్‌ గురూ! - A man married girl in Sultan Bazar - A MAN MARRIED GIRL IN SULTAN BAZAR

A Man Married Minor Girl : బాలికకు మాయమాటలు చెప్పి వివాహితుడు వివాహం చేసుకున్నాడు. అదీ కూడా ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని వచ్చాడు. తీరా ఆ యువతి మైనర్‌ కావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అప్పటికే యువతి తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. కానీ చివరి ట్విస్ట్‌ మాత్రం మిస్‌ కావద్దు.

Minor Girl Kidnap Case in Sultan Bazar
Minor Girl Kidnap Case in Sultan Bazar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 10:20 PM IST

Minor Girl Kidnap Case in Sultan Bazar : భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే బాలికను మరో వివాహం చేసుకున్న ఓ ప్రబుద్ధుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. యువతి తండ్రి తన కుమార్తె కనిపించడం లేదని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడంతో ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా కట్టంగూర్‌ ప్రాంతానికి చెందిన హరికృష్ణకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. సెంట్రింగ్‌ పనులు చేస్తూ ఉండే హరికృష్ణకు స్థానికంగా ఉండే ఓ బాలిక పరిచయం అయింది. ఆ అమ్మాయి మేడ్చల్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతుంది.

ఈనెల 11న స్నేహితులతో కలిసి కోఠిలోని ఎస్వీఎం గ్రాండ్‌ హోటల్‌లో భోజనం చేయడానికి వెళ్లిన ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి హరికృష్ణ తనతో పాటు తీసుకెళ్లాడు. ఎంతకీ కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి, తమ అమ్మాయి కనిపించడం లేదంటూ సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. ఈనెల 22న బాలికను విజయవాడకు తీసుకెళ్లి హరికృష్ణ వివాహం చేసుకున్నాడు. అక్కడి నుంచి నేరుగా స్వగ్రామానికి వెళ్లడంతో సదరు అమ్మాయి మైనర్‌ అని తేలడంతో యువకుడు తనను అక్కడే వదిలేసి పరారయ్యాడు.

సర్టిఫికెట్‌లోనే పుట్టిన తేదీ తప్పు : అయితే యువతి మాత్రం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తాను మేజర్‌ అంటూ ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ను చూపించింది. అందులో తప్పుగా పుట్టిన తేదీ పడిందని యువతి తల్లి చెప్పింది. అవసరమైతే తనకు కాన్పు జరిగిన పేట్ల బూర్జులోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వెళ్లి రికార్డులు పరిశీలించాలని కోరింది. ఆమె కోరిక మేరకు పోలీసులు అక్కడి వెళ్లి చెక్‌ చేయగా ఒక ఏడాది ముందు తేడా వచ్చినట్లు గమనించారు. దీంతో ఆ యువతి మైనర్‌గానే పోలీసులు నిర్ధారించారు.

ఆమెను మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టి బాలికతో స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి, స్టేట్‌ హోంకు తరలించారు. ఆ యువతి ఇచ్చిన సమాచారంతో హరికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కిడ్నాప్‌, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. నేరం రుజువైతే 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.

తల్లిదండ్రులు తిట్టారని ఇంటినుంచి బయటకొచ్చిన మైనర్ - మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన రాపిడో డ్రైవర్ - Girl Raped by Rapido Driver in ts

మైనర్​ తల నరికి తీసుకెళ్లిపోయిన వరుడు- మ్యారేజ్ లేట్ అవుతుందనే కోపంతో! - Young Man Murdered Girl

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.