ETV Bharat / state

ఆరేళ్లు సహజీవనం - పత్తి చేనులో ఆరడుగుల గొయ్యి బహుమతి - MAN KILLED LOVER AND BURIED

భార్యతో పాటు ప్రియురాలితో సహజీవనం - వివాహేతర బంధంలో తరుచూ గొడవలు

A Man Killed Her Lover And Buried In Bhadradri Kothagudem District
A Man Killed Her Lover And Buried In Bhadradri Kothagudem District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 6:29 PM IST

A Man Killed Her Lover And Buried In Bhadradri Kothagudem District : తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో స్వాతి అనే యువతి దారుణ హత్యకు గురైంది. ఆమె ప్రియుడు వీరభద్రం యువతిని అతి కిరాతకంగా చంపి గ్రామ సమీపంలోని పత్తి పొలంలో పాతిపెట్టాడు. మూడు రోజుల తర్వాత హత్య ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకిదిగి విచారణ చేపట్టారు. స్వాతి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.

ఆరేళ్లుగా సహజీవనం : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాచినేనిపేట తండాకు చెందిన భద్రం కొన్నాళ్ల క్రితం కొత్తగూడెంలోని ఓ మాల్ లో పనిచేసేవారు. అక్కడ స్వాతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. అనంతరం స్వాతిని ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు భద్రం. ప్రియురాలితోపాటు భార్య నందినితో కలిసి ఆరేళ్లుగా సహజీవనం సాగించాడు. కుటుంబ తగాదాలు, ఆర్థిక లావాదేవీలతోపాటు పలు కేసుల్లో భద్రం నిందితుడిగా ఉన్నాడు. కొంత కాలంగా భద్రం, స్వాతి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రియురాలి అడ్డు తొలగించుకోవాలని భద్రం నిర్ణయించుకున్నాడు.

ఏడాదిన్నర క్రితం హత్య- మందు బాటిల్​ సాక్ష్యం- రెండు కేసుల్లో నిందితుడు ఒకరే

పత్తి చేలో పాతిపెట్టి : నవంబర్ 9న ఇంట్లోనే స్వాతిని కత్తితో తలపై గట్టిగా కొట్టి హతమార్చాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా తల్లి సహకారంతో గోనెసంచిలో మూటగట్టి గ్రామ సమీపంలోని తన పత్తి చేనులోకి తీసుకెళ్లాడు. అక్కడే గొయ్యి తవ్వి ఖననం చేశాడు. మూడు రోజుల తర్వాత హత్య ఉదంతం బయటకు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి ద్వారా వివరాలు తెలుసుకొని ఖననం చేసిన ప్రాంతంలో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, తహశీల్దార్ స్వాతిబిందు సమక్షంలో పంచనామా చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడితోపాటు అతడి తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.

ప్రేమిస్తే ఓకే - కాదంటే హత్యే - ఉసురుతీస్తున్న ఉన్మాదం

స్వామీజీపై నమ్మకమే ప్రాణాలు తీసేలా చేసింది- విషాదాంతంగా సీఐ తల్లి మిస్సింగ్ కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.