ETV Bharat / state

భార్య, కుమార్తెను చంపి భర్త ఆత్మహత్య - ఏం జరిగిందంటే? - MAN KILLS WIFE AND DAUGHTER IN HYD - MAN KILLS WIFE AND DAUGHTER IN HYD

Husband Kills Wife And Daughter in Secunderabad : సికింద్రాబాద్​ బోయిన్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. భార్య, 10 నెలల పసికందును చంపిన ఓ వ్యక్తి అనంతరం రైల్వేట్రాక్​పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Husband Kills Wife And Daughter
Husband Kills Wife And Daughter (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 21, 2024, 8:09 AM IST

Updated : Jul 21, 2024, 10:19 AM IST

Husband Kills Wife And Daughter : కట్టుకున్న భార్య, కుమార్తెపైనే అతి కర్కశంగా ప్రవర్తించి దారుణ హత్యకు ఒడిగట్టాడు ఓ భర్త. అనంతరం తాను కూడా రైల్వే ట్రాక్​పైపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన సికింద్రాబాద్​ బోయిన్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఏసీపీ గోపాలకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గణేశ్ అనే వ్యక్తి​ గత మూడేళ్లుగా భార్య, కుమార్తెలతో కలిసి బోయిన్​పల్లి ఆర్య సమాజం వద్ద ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గణేశ్​ కుటుంబ పోషణ రీత్యా ఆటో డ్రైవర్​గా పని చేస్తున్నాడు. అయితే చక్కగా సాగుతున్న వారి సంసారంలో అభిప్రాయబేధాలు వచ్చాయి. భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి భార్య స్వప్న, 10 నెలల చిన్నారి నక్షత్రను గణేశ్ గొంతునులిమి చంపేశాడు.

ఒకే కుటుంబంలో ముగ్గురి మరణంతో విషాదఛాయలు : భార్య, కుమార్తెను చంపిన అనంతరం సుచిత్ర రైల్వే ట్రాక్​పై గణేశ్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే భార్యపై అనుమానంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురి మరణంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిడికి మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. తల్లి, తండ్రీ మరణంతో వారు అనాథలయ్యారు.

"ఈ రోజు 5 గంటలకు గణేశ్​ అనే ఆటో డ్రైవర్​ 100కు డయల్​ చేసి తన భార్యా బిడ్డలను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. వెంటనే స్పందించిన పోలీస్ పెట్రోలింగ్​ టీమ్​ అప్రమత్తమయ్యారు. అతడి ఇంటిదగ్గరకు పోలీసులు చేరుకునేసరికి స్నప్న, నక్షత్రలు అచేతనంగా పడి ఉన్నారు. గణేశ్​ కూడా సుచిత్ర రైల్వేస్టేషన్​ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటికే వారు చనిపోయినట్లుగా అంబులెన్స్​ సిబ్బంది నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నాం." - గోపాలకృష్ణ, బేగంపేట్​ ఏసీపీ

రీల్స్ మోజులో భార్య - హత్య చేసిన భర్త - వీడిన ఉప్పల్​ మర్డర్ మిస్టరీ - Man Killed wife in Uppal

ఉప్పల్​లో దారుణం - భార్యను హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి పరారైన భర్త - husband murder his wife In Uppal

Last Updated : Jul 21, 2024, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.