ETV Bharat / state

దొంగల కోసం సినీఫక్కీలో గ్రామస్థుల వేట- పోలీసుల రంగ ప్రవేశంతో కథ మలుపు! - villagers caught thieves - VILLAGERS CAUGHT THIEVES

A Gang of Robbers Chased and Caught by Villagers : దొంగలు ఎక్కడైన చోరి చేయ్యాలంటే ముందుగా పథకం ప్రకారం ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించిన తరువాత దొంగతనాలు చేస్తుంటారు. అనంతరం పోలీసులు వారిని వెంబడించటం చేస్తుంటారు. ఇలాంటి ఘననలు సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ చాలానే చూస్తుంటాం. అచ్చం ఇలాంటి సంఘటనే శ్రీ సత్యసాయి జిల్లాలో సినీఫక్కీని తలపించే విధంగా ఉంది.

A Gang of Robbers Chased and Caught by Villagers
A Gang of Robbers Chased and Caught by Villagers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 9:25 PM IST

A Gang of Robbers Chased and Caught by Villagers : ఓ గ్రామంలో దొంగతనం చేయాలనుకున్న ముఠా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం రెక్కీ నిర్వహించింది. ద్విచక్ర వాహనాలపై చేతిలో ఇనుప రాడ్లను పట్టుకొని ఆ గ్రామంలో హల్ చల్ చేశారు. వారిపై అనుమానం కలిగిన గ్రామస్థులకు ఆ ముఠాను పట్టుకోవాలనుకున్నారు. అచ్చం సినీఫక్కీని తలపించే విధంగా వెంబడించి, మాటు వేసి పట్టుకునే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసుల రంగ ప్రవేశంతో కథ మలుపు తిరిగింది. అసలేం జరింగిందో పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం?

మార్కెట్​లో ఫోన్ కొట్టేస్తూ అడ్డంగా దొరికిపోయిన దొంగ - పోల్​కు కట్టేసి చితకబాదిన వ్యాపారస్థులు - Mobile Thief

వివరాల్లోకి వెెళ్తే, శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం కొట్టంవారిపల్లిలో దొంగతనం చేయ్యడానికి ఓ ముఠా రెక్కీ నిర్వహించింది. కొట్టంవారి పల్లిలో రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు చేతిలో ఇనుప రాడ్లు పట్టుకొని తిరుగుతూ హల్ చల్ చేశారు. వారి ప్రవర్తనపై గ్రామస్థులకు అనుమానం కలిగింది. వారిని పట్టుకుని సంగతేంటో టేంతో? తేల్చుకొవాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లుగానే వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన దొంగలు రెండు ద్విచక్ర వాహనాలపై ఒక ముఠా రాయచోటివైపు మరో ముఠా కదిరి వైపు వెళ్లారు.

సమీపంలోనే మాటు వేసి : ఎలాగైనా వారిని పట్టుకునేందుకు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కదిరివైపు వెళ్లిన వారిని బైక్​పై వెంబడించారు. గ్రామస్థులు వెంబడిస్తున్నారని తెలుసుకున్న దొంగలు ద్విచక్ర వాహనాన్ని గాండ్లపెంట మండలం చామాలగొంది వద్ద వదిలి పారిపోయారు. వెళ్లిన దొంగలు కచ్చితంగా బైక్ కోసం వస్తారని తెలిసి కొట్టంవారి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడి సమీపంలోనే మాటు వేశారు. అనుకున్నట్లుగానే ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లేందుకు స్కార్పియో వాహనంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిని పట్టుకుంనేందుకు అప్పటికే మాటు వేసిన యువకులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. వెంటనే తెరుకున్న దుండగులు కారును తిమ్మమ్మ మర్రిమాను వైపు మళ్లీంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

పోలీసుల రంగ ప్రవేశం : అప్పటికే సమాచారం తెలుసుకున్న పోలీసులు గూటిబెలు సమీపంలో రోడ్డుపై వాహనాలను తనీఖీ చేస్తున్నారు. అందులో భాగంగానే స్కార్పియో కారుని ఆపడంతో అందులోని ఓ వ్యక్తి పారిపోయాడు. మరో వ్యక్తి యోగేశ్వర్ నాయుడుని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్కార్పియోతో పాటు దొంగలు వాడిన రెండు ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా : కొట్టంవారి పల్లిలో చోరీకి ప్రయత్నించిన వారిలో ఇద్దరిని అంతర్రాష్ట్ర దొంగలుగానూ, మరో ఇద్దరు ఎర్రచందనం అక్రమ సరఫరాలో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలపై కేసు నమోదు చేసిన పోలీసులు మిగతా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని నంబులపూలకుంట ఎస్సై శ్రీధర్ తెలిపారు.

పొదుపు సంఘం సభ్యుల ఇళ్లలో లీడర్ చోరీ- కిలాడీ లేడీ టాలెంట్​కు దొంగలు కూడా షాక్​ అవ్వాల్సిందే - Police Arrest

పట్టపగలే 66 లక్షలు చోరీ కేసు - బెయిల్​పై వచ్చి నిందితుడు ఆత్మహత్య - Accused Committed Suicide

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.