ETV Bharat / state

అమ్మ వచ్చిందని ఆనందంలో పరుగెత్తిన చిన్నారి, అంతలోనే? - FOUR YEAR YOUNG GIRL DIED SUDDENLY

రా..రా.. అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచిన తల్లి - పరుగెత్తుకొచ్చి ఒక్కసారిగా కిందపడి మృతి చెందిన చిన్నారి

A Four Year young Girl Died Suddenly in khammam District
A Four Year young Girl Died Suddenly in khammam District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2024, 11:33 AM IST

A Four Year young Girl Died Suddenly in khammam District : పరీక్ష రాసేందుకు వెళ్లిన తల్లి తిరిగి ఇంటికి రావడం చూసిన ఆ చిన్నారి అయ్‌ అమ్మొచ్చిందంటూ సంబరపడింది. ఆమెను హత్తుకునేందుకు గుమ్మం వైపు పరుగు తీసింది. తల్లి కూడా రా..రా.. అంటూ కూతుర్ని చూస్తూ చేతులు చాచింది. కానీ అమ్మను చేరక ముందే ఆ పాప ఒక్కసారిగా కుప్పకూలి క్షణాల్లో ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా గ్రామీణ మండల పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, స్థానికుల కథనం మేరకు, ఎంవీపాలెం గ్రామానికి చెందిన కుర్ర వినోద్, లావణ్య దంపతుల ఏకైక కుమార్తె ప్రహర్షిక(4). సోమవారం లావణ్య గ్రూప్‌-3 పరీక్ష రాసేందుకు వెళ్లగా చిన్నారి నానమ్మ, తాతయ్యల వద్ద ఆడుకుంటూ ఉంది.

కృష్ణా జిల్లాలో విషాదం - ఆడుకుంటూ చెరువులో పడి ఏడేళ్ల బాలిక మృతి - seven years old girl died in pond

పరుగెత్తుతూ కిందపడి మృతి : మధ్యాహ్నం ఇంటి తిరిగి వస్తున్న తల్లిని చూసి ప్రహర్షిక ఒక్కసారిగా పరుగెత్తుతూ కిందపడిపోయింది. తల్లి ఏమైందని ప్రశ్నించగా ఛాతీ వద్ద నొప్పి వస్తోందని చెప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు చెప్పారు. ఎప్పుడూ చలాకీగా ఉండే కుమార్తె ఉన్నట్లుండి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి గుండెపోటుతో మృతిచెంది ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.

బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలిక మృతి- ప్రమాదం నుంచి రక్షించినా దక్కని ప్రాణాలు

బాలిక అదృశ్యం ఘటన విషాదాంతం - శవమై తేలిన చిన్నారి - Seven Years Girl Dead Body Found

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.