ETV Bharat / state

వీడెవడండీ బాబూ - తాగేసి ఏకంగా బస్సు టాప్​పైనే పడుకుని ప్రయాణించాడు - DRUNKEN MAN SLEEP RTC BUS TOP

మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు పైకెక్కి ఆదమరచి పడుకున్న తాగుబోతు - బస్సు నాగుల గుట్ట పల్లికి చేరుకున్నాక గమనించిన స్థానికులు

A Drunken Man Sleep on Top of the RTC Bus
A Drunken Man Sleep on Top of the RTC Bus (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2024, 10:43 PM IST

Drunken Man Sleep on Top of the RTC Bus : మద్యం మత్తులో కొంతమంది చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాగిన మత్తులో ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? ఎలా ఉన్నామనే కానీసం సోయి కూడా ఉండదు. తాగినప్పుడు ఆ కిక్కులో తెలియడుతూ మరో ఊహల ప్రపంచంలో ఉంటారు. ఎవరి మీదకి పడితే వారి మీదకు గొడవకు వెళ్తు ఉంటారు. ఏది పడితే అది మాట్లాడుతుంటారు. వారు చెప్పిందే నిజం, ఇతరులు ఎంత మొత్తుకొని చెప్పినా వినరు. ఆ పరిస్థితుల్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు.

ఇంలాంటి ఘటనలు చూసేందుకు సరదాగా ఉంటాయి. మత్తులో ఉన్న వారి విచిత్ర ప్రవర్తనను చూసి నవ్వుకున్న వారెందరో. తాగిన మత్తు పూర్తిగా వదిలిన తరువాత కానీ చేసిన తప్పు బోధపడదూ! ఆ మహానుభావులకు. ఇలాంటి సంఘటనలు మన చుట్టుపక్కల తరచూ చూస్తునే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనే వైఎస్సార్ జిల్లాలో వెలుగు చూసింది.

ఆర్టీసీ బస్సులో మందుబాబు వీరంగం- ప్రయాణికులు ఏంచేశారంటే! - drunken man attacked conductor

ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం కొట్టి ఎక్కడ సేద తీరాలో తెలియక ఏకంగా ఆర్టీసీ బస్సు టాప్​నే ఎంచుకున్నాడు. మద్యం మత్తులో వేంపల్లి - రాయచోటికి వెళ్లే పల్లె వెలుగు బస్సు పైకి ఎక్కి ఆదమరచి పడుకున్నాడు. ఆ తాగుబోతును గమనించని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఎప్పటిలాగే ప్రయాణికులతో బయలు దేరారు. అలా ఆ బస్సు చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లి వరకు వెళ్లే దాక ఎవ్వరూ ఆ తాగుబోతును గమనించలేదు.

చివరికి బస్సు నాగులగుట్టపల్లికి చేరుకున్నాక ఆ తాగుబోతు బస్సు పైనుంచి కింద పడే సమయంలో అక్కడి స్థానికులు గమనించారు. వెంటనే బస్సు డ్రైవర్​కు సమాచారం ఇవ్వడంతో డ్రైవర్ బస్సు ఆపి ఆ తాగుబోతును కిందకు దించాడు. ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణించిన ఆ తాగుబోతుకు ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Liquor తిరుపతి నగరానికి ఏమైంది.. ! మందుబాబుల ఆగడాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు..!

మద్యం మత్తులో కుక్క పిల్లను తెచ్చి పిల్లికి వైద్యం చేయాలంటూ హల్ చల్ - man behaves influence of alcohol

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.