ETV Bharat / state

3 కోట్లు విలువ చేసే ఐఫోన్​ పరికరాలు స్వాధీనం - నలుగురు అరెస్టు - ట్విస్ట్ ఏంటంటే?

అబిడ్స్ జగదీశ్‌ మార్కెట్‌లో సోదాలు జరిపిన పోలీసులు - 3 కోట్ల రూపాయలు విలువ చేసే నకిలీ ఐఫోన్ పరికరాలు స్వాధీనం

Fake_Iphones_in_jagdish_market
Fake Iphones in Jagdish Market (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 59 minutes ago

Fake Iphones in Jagdish Market : తెలంగాణలోని ఈ మార్కెట్​లో మీకు అతి తక్కువ ధరలలో మీకు నచ్చిన ఫోన్​ దొరుకుతుంది. లక్షల రూపాయల ఫోన్ల నుంచి కేవలం 500 రూపాయలకు లభించే ఫోన్​ వరకు ఇక్కడ విక్రయిస్తారు. అంతే కాదు ఏ ఫోన్​ విడిభాగాలు కావాలన్నా ఇక్కడ అతి తక్కువ ధరకే ​లభ్యం అవుతుంది. మీ ఫోన్​కి ఎటువంటి రిపేర్ వచ్చినా, హైదరాబాద్​లో అతి తక్కువ ధరకు ఎక్కడ బాగు చేస్తారని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పే ఎకైన సమాధానం ఆ మార్కెట్​ పేరే. అంతలా ఆ మార్కెట్ ఫేమస్​ అయింది.

అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. కేవలం మంచిగానే కాకుండా చెడుగా కూడా ఈ మార్కెట్​ గురించి చెప్పేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఆ మార్కెట్​కి వెళ్తే మోసం చేస్తారంటూ చాలా మంది చెప్తూనే ఉంటారు. ఇటు మంచిగానూ, మరోవైపు చెడుగానూ ఆ మార్కెట్​కి పేరు ఉంది. మొబైల్​ ఫోన్​ రిపేర్​ చేయడం కోసం వెళితే అక్కడి షాపు వాళ్లు ఎలాంటి స్పేర్​ పార్టులు వేస్తారో, ఉన్న పార్టులు తీస్తారో అంటూ సామాజిక మాధ్యమాలలో మీమ్స్ సైతం వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి.

అలాగే మన చేతికి మళ్లీ మన ఫోన్​ వస్తుందో లేదో గ్యారంటీ లేదు అంటూ పలువురు జోక్స్ వేస్తూ ఉంటారు. అంతే కాకుండా దొంగ ఫోన్లు కూడా అక్కడ అమ్ముతారు. దొంగతనం చేసిన ఫోన్లను సైతం ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతారని అంటుంటారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అది ఏ మార్కెట్​ అని. అదే అబిడ్స్​లో ఉన్న జగదీశ్​ మార్కెట్​.

ఇప్పుడు తాజాగా ఇక్కడ "ఐఫోన్​"లను కూడా విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. ఐఫోన్​లు అమ్మితే పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు అనేగా మీ అనుమానం అంతా. ఎందుకంటే అవి నకిలీవి కాబట్టి. వారి నుంచి కోట్లు రూపాయలు విలువ చేసే నకిలీ ఐఫోన్ల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

రూ.3 కోట్ల నకిలీ ఐఫోన్ల పరికరాలు స్వాధీనం : హైదరాబాద్​లో ఉన్న జగదీశ్​ మార్కెట్​లో (Jagdish Market) నకిలీ ఐఫోన్లు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఐఫోన్ పరికరాలు విక్రయిస్తున్న వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 కోట్ల 42 లక్షల 55 వేల 900 రూపాయలు విలువచేసే యాపిల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్సు పోలీసులు అబిడ్స్​లోని జగదీష్ మార్కెట్లోని నాలుగు మొబైల్ షాప్స్​పై దాడి చేశారు. టార్గెట్ మొబైల్ షాప్ ప్రొప్రైటర్ నింబ్ సింగ్, పటేల్ మొబైల్ షాప్ ప్రొప్రైటర్ హీరా రామ్, ఔషపుర మొబైల్ షాప్ ప్రాప్రైటర్ గోవిందాల్ చౌహాన్, నంది మొబైల్స్ ప్రాప్రైటర్ ముకేష్ జైన్లను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వారి నుంచి ఆపిల్ బ్రాండ్ ప్రింటింగ్ లోగోలతో ఉన్న ఫేక్ ప్రోడెక్ట్​లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఎయిర్ పాడ్స్ 579, యుఎస్బీ అడాప్టర్స్ 351, యూఎస్బీ పవర్ కేబుల్ 747, బ్యాటరీలు 62, పవర్ బ్యాంక్ 17, బ్యాక్ పౌచ్ 1401 స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ మార్కెట్లో 2 కోట్ల 42 లక్షల 55 వేల 9 వందలు ఉంటుందని టాస్క్ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర వెల్లడించారు. తదుపరి విచారణ నిమిత్తమై నిందితుల నలుగురిని అబిడ్స్ పోలీసులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా జగదీశ్​కు మార్కెట్​కు వెళ్లేటప్పుడు ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

అక్కడ ₹8 వేలకే ఐఫోన్ ! - భారీ రాకెట్​ను ఛేదించిన పోలీసులు - stolen Cell phones

Last Updated : 59 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.