ETV Bharat / state

"కూలీలా? ఖాకీలా?" - తెలంగాణలో రోడ్డెక్కిన పోలీసుల కుటుంబాలు

ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్‌ - సచివాలయం ముట్టడికి ప్రయత్నించిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు

Police_Constable_Families_Protest
Police Constable Families Protest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Police Constable Families Protest at Secretariat : తెలంగాణలో పోలీసులు కుటుంబాలు రోడ్డెక్కాయి. ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలనే డిమాండ్‌తో ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో పోలీస్ బెటాలియన్​లో కానిస్టేబుల్​గా పని చేస్తున్న వారి భార్యలు ఆందోళనకు దిగారు. వారంతా సచివాలయం ముట్టడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి చేసింది. పలువురు అరెస్టు అయ్యారు.

గడ్డి తీయిస్తున్నారు: ఏక్ పోలీస్‌ విధానాన్ని అమలుచేసి, ఒకే దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఒకే దగ్గర 3 నుంచి ఐదేళ్లు పోస్టింగ్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ఒకే నోటిఫికేషన్‌, ఒకే పరీక్ష పెట్టినప్పుడు అందరికి ఒకేలా ఉద్యోగం ఉండాలి కానీ తమ భర్తలకే ఎందుకు కుటుంబాలకు దూరంగా ఉండే విధంగా ఉందని ప్రశ్నించారు. మట్టి, ఇటుకలు మోపిస్తున్నారని, గడ్డి తీయిస్తున్నారని వాపోయారు. ఎంతో కష్టపడి పరీక్ష రాసి జాబ్ తెచ్చుకుంటే, కూలల కంటే దారుణంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కూలీలా లేదంటే ఖాకీలా?: బెటాలియన్‌ కానిస్టేబుళ్లను కూలీలకంటే దారుణంగా చూస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి, ఇటుకలు మోయిస్తున్నారని, గడ్డి తీపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిక్రూట్​మెంట్ విధానంలో ప్రత్యేక బలగాలుగా కొంతమంది ఉద్యోగులను తీసుకుంటారని, బెటాలియన్ల ఉద్యోగాలు చేయడం వల్ల తమ కుటుంబాలకు దూరమవుతున్నామని వాపోయారు. భారీ సంఖ్యలో వచ్చిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు.

"ఎప్పుడు అంటే అప్పుడు పిలుస్తుంటారు, మళ్లీ వెంటనే వెళ్లిపోతారు. డ్యూటీ ఎంత ముఖ్యమో భార్యపిల్లలు కూడా అంతే ముఖ్యం కదా. మా అబ్బాయికి జర్వం వచ్చినా రెండు నెలల వరకు ఇంటికి రాని పరిస్థితి వచ్చింది. ఇలాగైతే కుటుంబంతో కలిసి ఎప్పుడు ఉంటారు. గడ్డి తీపిస్తుంటారు, మట్టి, ఇటుకలు మోపిస్తారు. ఇవన్నీ చేయడానికి వాళ్లు ఏమైనా పోలీసులా లేక కూలీలా." - పోలీస్ బెటాలియన్ కుటుంబ బాధితులు

"ఒక్కొక్కరికి ఒక్కో విధంగా డ్యూటీ ఎందుకు వేస్తున్నారు. చిన్నపిల్లలను తీసుకుని రోడ్డు పైకి వచ్చాము. కనీసం కొంచెమైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి కదా. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్న ఏక్‌ పోలీస్ విధానం తీసుకురావాలి. ఒకటే ఎగ్జామ్, ఒకటే నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఒకటే పోలీస్‌ ఎందుకు ఉండదు." - పోలీస్ బెటాలియన్ కుటుంబ బాధితులు

సెలవుల రద్దు వాయిదా: కుటుంబ సభ్యుల ఆందోళనతో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బెటాలియన్ కానిస్టెబుళ్ల సెలవుల రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో సెలవుల రద్దు నిర్ణయం వాయిదా వేశారు. అలాగే బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దేశంలోనే ఏపీ పోలీస్‌కు ప్రత్యేక బ్రాండ్‌ ఉంది: సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.