ETV Bharat / offbeat

పాత కాలం నాటి కమ్మటి "తాటి బూరెలు" - ఇలా చేస్తే రుచి అస్సలు మర్చిపోలేరు! - THATI BURELU RECIPE

ప్రకృతి ప్రసాదించిన తాటి పండ్లతో - అద్దిరిపోయే బూరెలు!

Thati Burelu Recipe In Telugu
Thati Burelu Recipe In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2025, 12:15 PM IST

Thati Burelu Recipe In Telugu : తాటి పండ్లు ప్రకృతి ప్రసాదిత వరం. వీటతో అనేక ప్రయోజనాలున్నాయి. ఒకప్పుడు తాటి పండ్లతో తాటి బూరెలు, తాటి రొట్టెలు ఎక్కువగా చేసుకుని తినేవారు. పాత కాలం నాటి కమ్మటి వంటల్లో తాటి బూరెలు కూడా ఒకటి. తాటి పండుతో కమ్మగా తాటి బూరెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • తాటి పండు - 1
  • బెల్లం తురుము - అరకప్పు
  • బియ్యం పిండి - ఒకటిన్నర కప్పు
  • యాలకుల పొడి - టీస్పూన్
  • ఎండుకొబ్బరి పౌడర్​ - 2 టేబుల్​స్పూన్లు
  • నూనె - సరిపడా

శివరాత్రికి చిలగడ దుంపకి లింక్​ ఏంటో తెలుసా? - ఆ రోజున ఎందుకు తింటారంటే!

తయారీ విధానం :

  • ముందుగా తాటి పండుపైన ఉన్న ఉన్న పీచుని పూర్తిగా తీసేయండి.
  • ఇప్పుడు పండుని మూడు భాగాలుగా విడదీసుకోండి. ఒక భాగాన్ని తీసుకుని గ్రేటర్​లో తురుముకోండి.
  • గ్రేటర్​లో పెద్ద రంధ్రాలున్న వైపు తురుముకుంటే తాటి గుజ్జు బాగా వస్తుంది.
  • ఇలా అన్నింటినీ తురుముకోగా వచ్చిన గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో బెల్లం తురుము వేసి బాగా కలపండి. ఇక్కడ మీరు తాటి గుజ్జు స్వీట్​నెస్​ని బట్టి బెల్లం తురుమును వేసుకోండి.
  • తాటి గుజ్జులో బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి, ఎండుకొబ్బరి పౌడర్ వేసుకోండి. తాటి బూరల్లోకి ఎండుకొబ్బరి వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. మీరు పచ్చికొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు.
  • ఆపై ఇందులోకి బియ్యం పిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మొత్తం ఒకేసారి వేయడం వల్ల పిండి సరిగా కలవదని గుర్తుంచుకోండి.
  • తాటి బూరలు పర్ఫెక్ట్​ రావడానికి పిండి మరీ పల్చగా, మరీ గట్టిగా లేకుండా ఉండాలి. బూరెల పిండి మృదువుగా ఉంటే బూరెలు చక్కగా ఎంతో రుచిగా వస్తాయి.
  • ఇలా పిండి ప్రిపేర్​ అయిన తర్వాత బూరెలు వేయించడానికి సరిపడా ఆయిల్​ స్టవ్​పై వేసి వేడి చేయండి.
  • నూనె వేడిగా ఉన్నప్పుడు స్టవ్​ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి బూరెలు వేసుకోండి.
  • బూరెలను రెండు వైపులా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • అంతే మిగిలిన పిండితో ఇలా సింపుల్​గా బూరెలు చేసుకుంటే సరి!
  • ఈ తాటి బూరెలను ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేసుకుంటే 5 రోజుల పాటు ఫ్రెష్​గా ఉంటాయి.
  • ఈ తాటి బూరెల తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ట్రై చేయండి.

గంటల కొద్ది మెత్తగా ఉండే "సొరకాయ చపాతీ" - మీ పిల్లలు ఒక్కటి కూడా మిగల్చరు!

పిండిలో ఈ ఒక్కటి వేస్తే చాలు - చపాతీలు ఎన్ని గంటలైనా మెత్తగా ఉంటాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.