ETV Bharat / state

నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు - TELANGANA WEATHER REPORT TODAY - TELANGANA WEATHER REPORT TODAY

TELANGANA WEATHER REPORT TODAY : రాష్ట్రంలో నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది మరింత బలపడి ఎల్లుండి ఉదయానికి తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది.

TELANGANA WEATHER REPORT TODAY
TELANGANA WEATHER REPORT TODAY (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 4:05 PM IST

TELANGANA WEATHER REPORT TODAY : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీన మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ తర్వాత ఇది ఈశాన్య దిశవైపుగా ప్రయాణిస్తూ మరింత బలపడి ఎల్లుండి ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుపాన్‌గా మారుతుందని పేర్కొంది.

తుపానుగా మారే అవకాశం : ఈ తుపాన్ ఉత్తర దిశలో కదులుతూ మరింత బలపడి తీవ్ర తుపాన్‌గా మారి ఈ నెల 26వ తేదీ నాటికి బంగ్లాదేశ్​ను అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌ తీరానికి చేరుకునే అవకాశముందని వాతావరణశాఖ వివరించింది. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతం ఉత్తర మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రాగాల రెండు రోజుల్లో విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Rains in the state today tomorrow : నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదే సమయంలో గంటకు 30నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వివరించింది.

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం - వాహనదారులకు తప్పని ట్రాఫిక్ తిప్పలు - Telangana Rains Report

Crop damage Due To Rains : రాష్ట్రంలో ఇటీవల హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిసాయి. దీంతో ఎండ వేడిమి నుంచి నగర వాసులకు కొంత ఉపశమనం లభించింది. అయినప్పటికీ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవడం వల్ల అక్కడక్కడా ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి.

మరికొన్ని జిల్లాల్లో రైతుల ధాన్యం తడిసిముద్దయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆరెబెట్టిన ధాన్యం తడిసాయి. దీంతో ధాన్యం రంగుమారాయి. మరోవైపు ఉద్యాన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఇటీవల ఈదురగాలులు, పిడుగులతో కూడిన వర్షాల వల్ల పలుచోట్ల మరణాలు సంభవించాయి. ధాన్యం తడిసిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వాన - వచ్చే 3 రోజులు కూడా వర్షమే​! - Heavy Rains in Telangana

పిడుగుపాటుకు ముగ్గురు మృతి - ఎక్కడంటే? - Three People Died to thundered

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.