71 Year Old Man Loses His Life Time Savings to Digital Arrest Scammers : ఇటీవల ఎక్కడ చూసినా డిజిటల్ అరెస్టులు కలకలం రేపుతున్నాయి. చదువుకున్నవారు, వృద్దులు వీటి భారిన అధికంగా పడుతున్నారు. ఈ క్రమంలో అమాకులకు బెదిరించి, మాయమాటలు చెప్పి, అధిక లాభాల ఆశ చూపి కోట్లు కొల్లగోడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇటువంటి ఘటనే అనకాపల్లి జిల్లాలో జరిగింది.
నర్సీపట్నానికి చెందిన 71 ఏళ్ల విశ్రాంత ఉద్యోగిని మభ్యపెట్టి సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.1.4 కోట్లు కాజేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణ సీఐ జి.గోవిందరావు మంగళవార తెలిపిన వివరాల ప్రకారం ‘మీ ఎకౌంట్‌కు సంబంధించి భారీ కుంభకోణం జరగడంతో మీరు డిజిటల్ అరెస్టు అయ్యారు.’ అని సైబర్ నేరగాళ్లు ముందుగాా ఫోన్‌చేస్ వృద్ధుణ్ని తీవ్రంగా బెదిరించారు. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే తమకు అడిగినంత సొమ్ము చెల్లించాలని సూచించారు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన బాధితుడు ఎన్నో ఏళ్లుగా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా దాచుకున్న నగదును విత్‌డ్రా చేసి మరీ వారికి పంపించారు.
ఆశ చూపారు, యాప్ డౌన్‌లోడ్ చేయించారు- కోటి రూపాయలు కొట్టేశారు
ఆ తరువాత మూడు రోజుల వ్యవధిలో ఆ మొత్తాన్ని నిందితులు చెప్పిన ఖాతాలకు జమ చేసేశారు. అంతా అయిపోయాక తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి విజ్ఞప్తి మేరకు ఆయన పేరు, ఇతర వివరాలు వెల్లడించడం లేదని సీఐ తెలిపారు. వెంటనే అప్రమత్తమై బాధితుడు పంపిన కొంత నగదు విత్‌డ్రా కాకుండా చూశామని, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను పంపించామని అధికారులు తెలిపారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులంటూ భయపెట్టినా, ఇతరత్రా బెదిరించినా వెంటనే 1930 నంబరును సంప్రదించాలని సూచించారు.
సైబర్ నేరగాళ్లు చెలరేగిపోయి సామాన్యుల ఖాతాలు కొళ్లగొడుతున్న ఘటనలు రోజు రోజుకూ పెరగిపోతున్నాయి. కాబట్టి ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమాన స్పదంగా కాల్స్ వచ్చినట్లైతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని తెలిపారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని కష్టపడి సంపాదించిన డబ్బు పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తువన్నారు.