ETV Bharat / state

భయపెడుతోన్న 'శంషాబాద్​ ఎయిర్​పోర్ట్' - 3 వారాలుగా అసలు ఏం జరుగుతోంది?

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు కాల్స్‌ - 3 వారాల్లో 65 కాల్స్ - తీవ్ర ఆందోళనకు గురవుతున్న ప్రయాణికులు, భద్రతా సిబ్బంది

Bomb Threat calls to Rajiv Gandhi Airport
Bomb Threat calls to Rajiv Gandhi Airport (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2024, 12:50 PM IST

Bomb Threat calls to Rajiv Gandhi Airport : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించే విమానాలకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపులు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మూడు వారాలుగా రోజూ పదుల సంఖ్యలో ఆగంతకుల నుంచి వస్తున్న సందేశాలు అటు భద్రతా సిబ్బంది, ఇటు ప్రయాణికుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

  • బుధవారం ఉదయం మూడు, మంగళవారం 6 బాంబు బెదిరింపులు రాగా, ఈ నెల 22న అత్యధికంగా 35 బెదిరింపు కాల్స్‌ వచ్చాయి.
  • మొత్తంగా అక్టోబరు 1 నుంచి 30 వరకు 65 బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. ఇవన్నీ ఉత్తుత్తివే అని తనిఖీల తర్వాత నిర్ధారణ అవుతున్నా, ప్రయాణికుల భద్రత దృష్ట్యా తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
  • గతంలో ఏడాదికి ఒకటీ, రెండు బెదిరింపులు వస్తుండేవి. ఇప్పుడు రోజూ పదుల సంఖ్యలో రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. దానికి అనుగుణంగా అధికారులు నిర్వహిస్తున్న తనిఖీలతో విమానాలు ఆలస్యమవడంతో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పౌర విమానయాన శాఖ సైతం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.

హైదరాబాద్​ ఎయిర్‌పోర్టులో 6 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్‌ - తెర వెనక ఆ పుస్తక రచయిత!

వాయిదా పడుతున్న ప్రయాణాలు : శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సంవత్సరానికి 2.5 కోట్ల మంది దేశ, విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. రోజూ సగటున లక్ష మంది ప్రయాణికులు వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. 450 - 500 సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికులకు తోడు సందర్శకుల రూపంలో కనీసం 4 - 5 లక్షల కంటే ఎక్కువ మంది వస్తుంటారు. భారీ రద్దీ దృష్ట్యా ఈ బెదిరింపుల్ని తేలిగ్గా తీసుకోకుండా క్షుణ్నంగా తనిఖీ చేస్తుండటంతో ప్రయాణాలు వాయిదా పడుతున్నాయి. విమాన సిబ్బంది, ప్రయాణికులతో పాటు వారి వస్తువులను మొత్తం తనిఖీ చేయాలి. అప్పుడే లోనికి పంపించాలి. గంటకు మించి ఆలస్యమైనప్పుడు విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఆహార సదుపాయం కల్పించాల్సి ఉంటుంది.

గంటల కొద్దీ సమయం పడితే విశ్రాంతి తీసుకోవడానికి వందలాది మంది ప్రయాణికులకు హోటల్‌ రూమ్స్‌ ఇవ్వాలి. మరోవైపు ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ కోసం దిల్లీ, ముంబయి వంటి నగరాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వారికి మరీ ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో విమానం ఆలస్యమైతే మొత్తం ప్రయాణం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పైలట్లు, ఎయిర్‌ హోస్టెస్, సిబ్బంది బస దీనికి అదనంగా ఉంటుంది.

ఇప్పటి వరకు 8 కేసులు నమోదు : ఎయిర్‌పోర్టు పూర్తి భద్రత సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనంలో ఉంటుంది. ప్రయాణికులు, వారి వస్తువులను పూర్తిస్థాయిలో తనిఖీ చేశాకే విమానాశ్రయం లోపలికి అనుమతిస్తారు. వందలాది మంది ప్రయాణికుల భద్రత, అంతర్జాతీయంగా ముడిపడిన అంశం కావడంతో తేలిగ్గా తీసుకోకుండా పదుల సంఖ్యలో కాల్స్‌ వచ్చినా పిన్‌ టూ పిన్‌ క్షుణ్నంగా పరిశీలిస్తారు. బెదిరింపుల కాల్స్ వరుసగా వస్తున్న కారణంగా దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? అని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఖలీస్థానీ పేరుతో వేర్పాటువాదుల బెదిరింపుల దృష్ట్యా ఆర్టీఐఏ పోలీసులు ఇప్పటివరకూ 8 కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

రాజ్​పార్క్ హోటల్​కు బాంబు బెదిరింపు - రంగంలోకి దిగిన బాంబ్​ స్క్వాడ్స్

తిరుపతిలో హై అలర్ట్ - హోటళ్లు, విమానానికి బాంబు బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.