6 Crore Gold Scam in Hyderabad : తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి రూ.6.12 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఐటీ ఉద్యోగి సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. ఈవోడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) డీసీపీ కె.ప్రసాద్ ఏసీపీ సోమనారాయణ సింగ్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన గంటా శ్రీధర్ (40) మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొండాపూర్ మసీదు బండలో కుటుంబంతో నివసించేవాడు. తోటి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు కొంపల్లిలోని ఓ వ్యాపారితోనూ పరిచయం పెంచుకున్నాడు.
Low Price Gold Scam Accused Arrest : పరిచయం పెంచుకున్న వ్యక్తులు మార్కెట్ ధర కంటే తక్కువకే బంగారం కొనుగోలు చేస్తారని నిందితుడు తెలుసుకున్నాడు. దీంతో పథకం ప్రకారం తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని అందరూ పెట్టుబడులకు ముందుకు రావాలని ప్రేరణ కల్పించాడు. నగదు చెల్లించిన కొద్ది రోజుల తర్వాత బంగారం డెలివరీ అవుతుందని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన కొంపల్లి వ్యాపారి రూ.1.48 కోట్లు బదిలీ చేశారు. ఇలానే మరో 12 మంది నుంచి కలిపి నిందితుడు మొత్తం రూ.6.12 కోట్లు వసూలు చేశాడు.
ట్రేడింగ్ పేరుతో టీచర్‌కు టోకరా - రూ.29 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు - Cyber Criminals Fraud
Gold Scam Worth 6 Crore Rupees : బాధితులందరికీ కొన్ని ప్రామిసరీ నోట్లు, బాండ్లు, చెక్కులు నిందితుడు ఇచ్చాడు. సికింద్రాబాద్‌లోని 2 బంగారం దుకాణాల పేరుతో డబ్బు బదిలీ చేయించుకున్నాడు. అందరికీ మార్చి 22న బంగారం డెలివరీ చేస్తానని చెప్పాడు. అయితే మార్చి 5న అందరికీ ఫోన్ చేసి తిరుపతిలో తనకు సంబంధించిన భూ సమస్య ఉండటంతో వెళ్తున్నానని చెప్పి భార్యాపిల్లలతో సహా ఉడాయించాడు. అప్పటి నుంచి ఫోన్ చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చిన బాధితులు నిందితుడి గురించి ఆరా తీయగా, కొండాపూర్‌లోని అతని ఫ్లాటు ఖాళీ చేశాడని, మోసపోయామని తెలుసుకున్నారు.
ఖాకీ ఉద్యోగాల పేరుతో రూ.11 లక్షలు కుచ్చుటోపీ - నకిలీ పోలీస్ అరెస్టు - fake cop arrested
తిరుపతిలో దొరికిన నిందితుడు : బాధితులు అందరూ కలిసి సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు. జరిగిన విషయాన్ని చెప్పి, ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో నిందితుడ్ని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తీసుకువచ్చి శనివారం రిమాండ్‌కు తరలించారు.
ఘరానా మోసం - క్రెడిట్ కార్డు రుణ పరిమితి పెంచుతామంటూ బ్యాంక్ ఖాతా ఖాళీ - Cyber fraud in Hyderabad