4 Year Old Dies After Drinking Cooldrink : ఇంట్లో చిన్నపిల్లలు ఏవైనా వస్తువులు కనిపిస్తే వాటితో ఆడుకోవడం, నోటిలో పెట్టుకోవడం చూస్తుంటాం. అవి ఒకవేళ ద్రవ పదార్థాలైతే వాటిని తాగేందుకు కూడా వెనుకాడరు. ఇలాంటి పనులు ఒక్కోసారి ప్రమాదాలనూ తెచ్చిపెడుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కూల్ డ్రింక్ అనుకుని విషపూరిత క్రిమి సంహారక మందు తాగి ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో జరిగింది. ఇద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో అబ్బాయి ప్రాణాలతో బయటపడ్డాడు.
కూల్డ్రింక్ అనుకుని విష పదార్థం సేవించి : దసరా పండగకు మేనమామ ఇంటికి వచ్చిన ఇద్దరు పిల్లలు, కూల్డ్రింక్ సీసాలోని పురుగు మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. పండుగపూట విషాదం చోటుచేసుకోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘట్‌కేసర్ పోలీసుల వివరాల ప్రకారం ఘనపూర్‌లోని బానోత్ శ్రీధర్ ఇంటికి అతని సోదరి ఇద్దరు పిల్లలతో వచ్చింది. ఈ నెల 15న ఇంట్లో చిన్నారులు కార్తీక్ (6) కీర్తి (4) ఓ శీతల పానీయం సీసా చూసి, అందులోని ద్రవాన్ని తాగారు. అందులో విషపూరిత క్రిమి సంహారక మందు ఉండటంతో వెంటనే కుటుంబ సభ్యులు ఘట్‌కేసర్ ప్రభుత్వ హాస్పిటల్కు, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కీర్తి మృతి చెందినట్లుగా మేనమామ బానోత్ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా కార్తీక్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
మద్యం మత్తులో గొంతు కోసుకుని వ్యక్తి మృతి : మరో ఘటనలో మద్యం సేవించిన మత్తులో ఓ వ్యక్తి గొంతు కోసుకుని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మల్కాజిగిరి సీఐ సత్యనారాయణ సోమవారం తెలిపిన వివరాల మేరకు విష్ణుపురికాలనీలో శ్రీను (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు మద్యానికి బానిసై పదేళ్లుగా కుటుంబాన్ని నానా ఇబ్బంది పెడుతున్నాడు. అతడికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ఈ నెల 20న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో గొంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో శ్రీనును గాంధీ ఆసుపత్రికి తరలించగా, సోమవారం చికిత్స పొందుతూ మరణించాడు.
Mother commits suicide with Children : ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య