Cyber Crimes Case in Vijayawada : డిజిటల్ అరెస్టు అంటూ వచ్చే ఫోన్లను నమ్మవద్దని సైబర్ పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా అమాయకులు మోసపోతూనే ఉన్నారు. నకిలీ పోలీసుల మాటలకు బెంబేలెత్తిపోయి పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లింస్తున్నారు. కొద్ది నెలలుగా విజయవాడ నగరవాసులను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టేస్తూ రూ.లక్షల నుంచి రూ.కోట్లు గుంజేస్తున్నారు. తాజాగా విజయవాడలో గాయత్రినగర్‌కు చెందిన యువతి (25) ఇలాగే మోసపోయి సైబర్ నేరగాళ్లకు 1.25 కోట్లు రూపాయలు చెల్లించింది. తరువాత మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.
డబ్బులు లేవంటే రుణం ఇప్పించి మరీ మోసం చేశారు !
విజయవాడలోని గాయత్రినగర్‌కు చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. ఆమె శుక్రవారం ( నవంబర్ 15న) విజయవాడకు తల్లిదండ్రులను చూసేందుకు వచ్చారు. ఉదయం 10.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ముంబయి పోలీసులు అంటూ పరిచయం చేసుకున్నాడు. మీకు వచ్చిన కొరియర్‌లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం అంటూ భయపెట్టాడు. అరెస్టు కాకుండా ఉండాలంటే కొంత సొమ్ము చెల్లించాలని చెప్పడంతో యువతి భయపడింది. దీంతో ఆమె 1.25 కోట్లు రూపాయలను ఆగంతకుడు చెప్పిన అకౌంట్కు పంపించింది. ఆ తర్వాత మోసపోయినట్లు గుర్తించింది. దీంతో శుక్రవారం (నవంబర్ 15న) రాత్రి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం నగదు బదిలీ అయిన బ్యాంకు అకౌంట్ వివరాలు సేకరింస్తున్నట్లు సైబర్ క్రైం సీఐ గుణరాం తెలిపారు.
'యూ ఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్' - అంటే నమ్మకండి! - cyber crimes in AP
వీడియో కాల్ వస్తే అలా చేయండి - ఫ్రంట్ కెమెరా మూసిన తర్వాతే లిఫ్ట్ చేయండి