24 Trains Cancelled in AP : విజయవాడ - విశాఖపట్నం మధ్య పలు సెక్షన్లలో ట్రాక్ మరమ్మతుల కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ నెల 24 నుంచి ఆగస్టు 10 వరకు 24 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఎ పాటిల్ తెలిపారు. ప్రమాదాల నివారణ సహా ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేందుకు వీటిని చేపట్టినట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా ట్రాక్‌ను పటిష్ట పరచడం సహా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు నరేంద్ర ఎ పాటిల్ పేర్కొన్నారు.
Tains Cancel for Track Maintenance in Vijayawada : ఇందులో భాగంగా విజయవాడ - నిడదవోలు సెక్షన్ మధ్య 4.9 కిలోమీటర్లు, నిడదవోలు - సామర్లకోట మధ్య 4.1 కిలోమీటర్లు, సామర్లకోట -దువ్వాడ మధ్య 5.5 కిలోమీటర్లు కలిపి మొత్తం 14.6 కిలోమీటర్ల పరిధిలో ట్రాక్ రెన్యువల్ పనులు జరుగుతున్నట్లు డీఆర్ఎం నరేంద్ర ఎ పాటిల్ తెలిపారు. వీటితో పాటు స్లీపర్ రెన్యువల్ పనులు చేపట్టినట్లు చెప్పారు. అత్యవసరంగా పనులు చేపట్టడం వల్లే రైళ్లను రద్దు చేయవలసి వచ్చిందన్నారు. ఈ మేరకు ప్రయాణికులు అర్థం చేసుకుని తమకు సహకరించాలని నరేంద్ర ఎ పాటిల్ విజ్ఞప్తి చేశారు.
మరమ్మతులకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని నరేంద్ర ఎ పాటిల్ పేర్కొన్నారు. పనులు పూర్తయ్యే క్రమానికి అనుగుణంగా పలు రైళ్లను తిరిగి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. విజయవాడ - విశాఖపట్నం మధ్య ప్రస్తుతం ఉన్న డబుల్ లైన్‌ను నాలుగు లైన్లుగా మార్చేందుకు ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపినట్లు వివరించారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే పనులను ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రయాణ సమయం తగ్గుతుంది : మరోవైపు ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థలో రెండు స్టేషన్ల మధ్య నాలుగు చోట్ల సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నరేంద్ర ఎ పాటిల్ తెలిపారు. తద్వారా ట్రాక్‌పై రైళ్లను ఎక్కువ సేపు నిలపకుండా చేసే అవకాశం కలుగుతుందని వివరించారు. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గుతుందని నరేంద్ర ఎ పాటిల్ వెల్లడించారు.
47 రోజులపాటు ఆ మూడు రైళ్లు రద్దు - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు - trains cancelled
విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లు రద్దు- ఆగస్టు 15వరకు వేళల్లో మార్పులు